పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 280 P.pdf/135

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

"ఆ దినం మట్ట మధ్యాహ్నమే ప్రొద్దు క్రుంకగా
పట్టపగలే నేలపై చీకట్ల అలముకొనేలా చేస్తాను",

ఇంకా, నిర్గమకాండం గూడ“మూడు రోజులపాటు ఐగుప్త దేశం అంతటా కటిక చీకటి క్రమ్మింది" అంటుంది - 10,22 ఈలాంటి వాక్యాలు మత్తయి రచనను ప్రభావితం చేసి వుండవచ్చు. చీకటి దుఃఖానికి సంతాపానికీ గుర్తుకదా!

ప్రభువు సిలువపై 22వ కీర్తనను భక్తితో జపిస్తున్నాడు. ఈ కీర్తనకర్త ఎవరో ఓ పూర్వవేదప నీతిమంతుడు. మహాభక్తుడు. ఘోర శ్రమలకి గురైనవాడు. అతడు ఈ కీర్తనం మొదటి భాగంలో తన శ్రమలనూ సంతాపాన్నీ వర్ణించుకొన్నాడు. రెండవభాగంలో యావే తన బాధలను తొలగించి తనకు విజయాన్ని ప్రసాదించాడని ఉల్లాసంతో చెప్పకొన్నాడు. క్రీస్తు సిలువ మిూద వ్రేలాడుతూ ఈ కీర్తనలోని మొదటి చరణాన్ని పెద్దగా ఉచ్చరించాడు. ఆ చరణం హీబ్రూలో "ఏలీ ఏలీ లెమా సబక్తాని” అనే మాటలతో ప్రారంభమౌతుంది. నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచావని ఈ మాటలకు అర్థం - 27,46. ప్రభువు శ్రమలు ఘొరమైనవి. అతనికి తన తండ్రే తన్ను చేయి విడచినట్లనిపించింది. మహాదుఃఖం కలిగింది. ఇక తనకు ఆశ్రయమేమిూ లేదు అని తోచించిది. కాని అలాంటి ఆపత్సమయంలో కూడ క్రీస్తు నిరాశకు గురికాలేదు. తండ్రిని పూర్ణంగా నమ్మాడు. ఆ తండ్రిపట్ల తనకున్న విశ్వాసాన్ని అణుమాత్రం కూడ కోల్పోలేదు. ప్రభువు పూర్వవేద భక్తుల విశ్వాసానికి ప్రతీకగా వుంటాడు. తనకుముందు ఈలాంటి శ్రమలకు అనుభవించిన పూర్వవేద భక్తుని మాటలే జపిస్తూ తండ్రికి అంటిపెట్టుకొని వుండిపోయాడు.

"ఏలీ! ఏలీ" అనే మాటలు విని సిలువ దగ్గరవున్న యూదులు, క్రీస్తు ఏలీయా ప్రవక్తను పిలుస్తున్నాడు గాబోలు అని బ్రాంతిపడ్డాడు. ఈ ప్రవక్త తన జీవిత కాలంలో యూదులను అన్నివిధాల ఆదుకొన్నవాడు. అతడు అంత్యకాలంలో, మల్లా తిరిగి వస్తాడని యూదుల నమ్మకం. కనుక శత్రువులు క్రీస్తు ఈ యాపద్బాంధవుణ్ణి తనకు సహాయం చేయడానికి రమ్మని పిలుస్తున్నాడు గాబోలు అనుకొన్నారు. వారిలో ఒకడు స్పోంజిని పులియబారిన ద్రాక్షరసంలో ముంచి క్రీస్తుకి అందించాడు - 27,48. ఒకవేళ ఏలియా దిగివస్తాడేమో, అప్పటిదాకా క్రీస్తుని ప్రాణాలతో నిలబెడదామని అతని తలంపు. ప్రభువు ఈ రసాన్ని ముట్టుకోలేదు. ఇక్కడ కీర్తన 69,21వ చరణం నెరవేరింది. ఆ కీర్తన ఈలా చెప్తుంది, "నేను దప్పికగొని వున్నపుడు వాళ్లు నాకు సిర్మానిచ్చారు". సిర్మాఅంటే పలిసిన ద్రాక్షరసం లేక వెనిగర్.

శత్రువులు క్రీస్తుని ఇంకా ఎగతాళి చేస్తూనే "ఆగండి ఏలీయావచ్చి ఇతన్ని రక్షిస్తాడేమో చూద్దాం. ఇతని భక్తి యేపాటిదో ఇప్పడే తేలిపోతుంది” అని వెటకారంగా