పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 280 P.pdf/134

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విూదిగానే ఎల్లరికీ రక్షణం కలుగుతుంది - అ,చ, 4,12. కనుక అతడు ప్రభువు నుండి రక్షణాన్ని అడుగుకొన్నాడు, అతన్ని రాజును గాను తన్ను దోషినిగాను భావించుకొని తన తప్పిదాలకు మన్నింప వేడుకొన్నాడు. భవిష్యత్తులో క్రీస్తు తనకు రక్షణాన్ని ప్రసాదిస్తాడని విశ్వసించాడు. అతని విశ్వాసాన్ని మెచ్చుకొని ప్రభువు నేడే నీకు పరలోక ప్రాప్తి కలుగుతుందని చెప్పాడు.

ఈ మంచిదొంగను చూచి మనం ఓ పాఠం నేర్చుకోవాలి. నరుడు చిట్టచివరి క్షణాల్లో కూడ పశ్చాత్తాపపడి దేవుని నుండి మన్నింపు పొందవచ్చు. ఆలస్యంగా పశ్చాత్తాపపడినా ఫలితం దక్కుతుంది.

మంచిదొంగ చనిపోతూ కూడ దొంగగానే చనిపోయాడు. అనగా అతడు చిట్టచివరి క్షణాల్లో మోక్షాన్ని కొల్లగొట్టాడు.

పైన మనం చూచిన వివరణంలో క్రీస్తు దేవుని కుమారుడా అన్న ప్రశ్న చాలసార్లు వచ్చింది. అతడు తప్పకుండా దేవుని కుమారుడే. అలాగే అతడు సిలువ మిూది నుండి క్రిందికి దిగిరావచ్చు కదా అనే ప్రశ్నకూడ చాలసార్లు వచ్చింది. క్రీస్తు అలా ఎందుకు దిగిరాలేదు?

సిలువ విూది నుండి దిగిరావడం నరునికి తగుతుంది. సిలువవిూద చనిపోవడం దేవునికి తగుతుంది. క్రీస్తు సిలువ విూద చనిపోవడం ద్వారా దేవుని చిత్తాన్ని పరిపూర్ణంగా నెరవేర్చాడు. పాపులమైన మనపట్ల తనకుగల గాఢమైన ప్రేమను గూడ నిరూపించాడు. సిలువ మిూది నుండి దిగిరాలేదు కనుకనే క్రీస్తు నేడు మనకు ఆరాధ్యుడయ్యాడు. విశ్వసనీయుడయ్యాడు. యూదులు క్రీస్తులో భౌతికశక్తి గల మెస్సీయాను చూడగోరారు. అతడు తన భౌతిక బలంతో సిలువ విూది నుండి దిగిరావాలని కోరారు. కాని క్రీస్తు ప్రేమతో ఆత్మార్పణం చేసికొనే మెస్సీయా, కనుకనే అతడు సిలువపై చనిపోయాడు. అతని ప్రేమను అర్థం చేసికోనివారికి అతని సిలువమరణం అర్థం కాదు.

2. క్రీస్తు మరణం – 27,45-56

క్రీస్తు సిలువ మిద వ్రేలాడుతూండగా మట్టమధ్యాహ్నం నుండి చీకట్ల క్రమ్మకొన్నాయి - 27,45, ఈ చీకట్ల రక్షణ చరిత్రలో ప్రాతయుగం గతించి క్రొత్తయుగం ప్రారంభమైందని తెలియజేస్తాయి, క్రీస్తు మరణంతో వరప్రసాద యుగం ఆరంభమౌతుంది, అంత్యదినం, అనగా మెస్సీయాకాలం, వచ్చినపుడు చీకట్ల క్రమ్మకొంటాయని ఆమోసు ప్రవక్త చెప్పాడు – 8–9.