పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 280 P.pdf/128

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఈ సందర్భంలో క్రీస్తు పచ్చి ప్రమానుకే ఇంత ఆపద కలిగితే ఇక ఎండు ప్రమానుకి ఎంత ఆపద కలుగుతుందో ఊహించండి అన్నాడు - 23,31. ఇది ఓ సామెత. ఇక్కడ దీని భావం ఇది. నిర్దోషియైన క్రీస్తునే రోమియులు ఇంతగా బాధిస్తుంటే, ఇక దోషులైన యెరూషలేము పౌరులను వాళ్లు ఎంతగా బాధించరు? యూదులు తర్వాత రోమియల మిూద తిరుగుబాటు చేసి దోషులౌతారు. కనుక రోమికాయులు వారిని ఊచకోత కోస్తారు. ఇంకా, పచ్చికొయ్య కాలడానికి యోగ్యంగా వుండదు. క్రీస్తు దీనిలాంటివాడు. ఎండుకొయ్య కాలడానికి యోగ్యంగా వుంటుంది. యెరూషలేము పౌరులు దీనిలాంటివాళ్లు, ఇంకా, క్రీస్తు బ్రతికివున్న చెట్టలాంటివాడు. జీవమిచ్చేవాడు. యూదులు ఎండిపోయిన చెట్టులాంటివాళ్లు, దోషులు.

మొత్తం విూద పుణ్యస్త్రీలకు చెప్పిన ఈ మాటలు యెరూషలేము విూదికి రానున్న దైవశిక్షను తెలియజేస్తాయి. లూకా ఈ సువిశేషాన్ని వ్రాసేప్పటికే యెరూషలేము దాని లోని దేవాలయము పైశిక్షకు గురై ధ్వంసమయ్యాయి.

క్రీస్తుని సిలువ వేసింది నగర ప్రాకారాలకు వెలుపల, ఓ చిన్న కొండమిూద, దానికి గొల్గొతా అని పేరు. ఆ పేరుకి కపాలం అని అర్థం. కాని ఆ పేరు దానికేలా వచ్చింది? ఆ కొండ తలపర్రె ఆకారంలోనైనా వుండవచ్చు, లేదా ఆ ప్రాంతాని కంతటికి కలిపి పుర్రె అనే పేరైనా వుండవచ్చు. అది ద్రోహులను వధించేతావు కనుక వారి పర్రెలు అస్టులు అక్కడ చిందరవందరగా పడివుండవచ్చు.

ఈ సందర్భంలో లూకా సువిశేషంన ప్రభువు సిలువపై నుండి శత్రువుల కొరకు చేసిన ప్రార్థనను వర్ణిస్తుంది. “తండ్రీ వీళ్ళేమి చేస్తున్నారో వీళ్ళకే తెలియదు. నీవు వీళ్ళను క్షమించు" అని క్రీస్తు ప్రార్థించాడు - లూకా 28,34. శత్రువులను ప్రేమించమని ప్రభువు ముందుగానే శిష్యులను ఆదేశించాడు. ఇక్కడ తన ఆదేశాన్ని తానే పాటించాడు. రోమను సైనికులు అజ్ఞానంతో తన్ను వధిస్తున్నారు గనుక వారిని క్షమించమని తండ్రికి మనవి చేసాడు. పరలోకంలోని తండ్రి కరుణామయుడు. నరుల అవివేకాన్ని పాపాన్ని మన్నించేవాడు. కనుక అతడు ఈ శత్రువులను గూడ క్షమిస్తాడు. క్రీస్తు శత్రువుల కొరకు చేసిన ఈ ప్రార్థన సైఫనుకు ఎంతో స్ఫూర్తి నిచ్చింది. అతడు కూడ చనిపోయేపుడు శత్రువుల కొరకు ఈలాంటి ప్రార్థనే చేసాడు. ప్రభూ! ఈ పాపాన్ని వీరిపై మోపకు" అని మనవిచేసి మరణించాడు - అచ 7,60. నేడు క్రీస్తు శిష్యులమైన మనం శత్రువుల విూద పగ తీర్చుకోవడానికి సిద్ధంగా వుంటాం. కాని ఇది ప్రభువు బోధలకు విరుద్ధం. ఆ గురువు మార్గాన్ని అనుసరించి మనం కూడ విరోధులను క్షమించాలి.