పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 280 P.pdf/129

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

చనిపోకముందు ప్రభువుకి చేదు కలిపిన ద్రాక్ష రసాన్ని ఇచ్చారు - 27,34 ఇది మత్తుమందులా పనిచేస్తుంది. కొరతవేయబడేవాళ్లు దీన్ని త్రాగి తమ బాధను కొంతవరకు మర్చిపోయేవాళ్లు, యెరూషలేములోని సంపన్న మహిళలు దీన్ని తయారు చేసి సిల్వపై చనిపోయేవాళ్లకు ఉచితంగా యిచ్చేవాళ్లు, అది వో కరుణ కార్యం. క్రీస్తు ఆ రసాన్ని రుచి చూచి దాన్ని త్రాగడానికి ఇష్టపడలేదు, ఎందుకు? అతడు మనకొరకు సంపూర్ణంగా కష్టాలు అనుభవింపగోరాడు. కనుక ఆ కష్టాలను తగ్గించివేసే రసాన్ని ముట్టుకోలేదు. కీర్తన 69,21. "వాళ్లు నాకు భోజనానికి మారుగా విషాన్నిచ్చారు" అని చెప్తుంది. ఈ వాక్యంలోని విషం చేదు కలిపిన ద్రాక్ష రసమే. క్రీస్తు సిలువమరణంలో ఎదురయ్యే చాల సంఘటసలను పూర్వవేదం ముందుగానే పేర్కొంది. ఈలాంటి వాక్యాలను మత్తయి ప్రత్యేకంగా ఒబాహరిస్తుంటాడు. క్రీస్తు మరణం వల్ల పూర్వవేద లేఖనాలు నెరవేరాయని చెప్పడం అతని ఉద్దేశం. 69వ కీర్తన వ్రాసిన భక్తుడు ఆ గీతంలో తన సొంత శ్రమలను చెప్పకొన్నాడు. ఆ శ్రమలు క్రీస్తునందు నెరవేరాయి, క్రీస్తు పూర్వవేదం లోని నీతిమంతుల శ్రమలను తన శ్రమలనుగా జేసికొన్నాడు. తానూ వారి కష్టాలను అనుభవించి వాటిని పునీతం చేసాడు.

క్రీస్తు సిలువ మిూద నానాయాతనలూ ఫరోరశ్రమలూ అనుభవించాడు. ఐనా సువిశేషాలు క్రీస్తు శారీరక బాధలను వర్ణించవు. సిలువ మరణం ఎంతో బాధాకరమైంది. దానితో సాటివచ్చే శ్రమ ప్రాచీనకాలంలో లేనేలేదు. ఐనా మత్తయి సువిశేషం "వారు ఆయనను సిలువ వేసారు" అనే చిన్న వాక్యం చెప్పి ముగించింది - 27,35, సువిశేషకారులు క్రీస్తు శారీరక శ్రమలను గాక అతని మరణం మనకేలా రక్షణం సాధించిపెట్టిందో తెలియజేసారు, అంతే. నేడు మనం కూడ ప్రభువు దైహిక శ్రమలకంటె అతని మరణ పరమార్గాన్ని అధికంగా ధ్యానం చేసికోవాలి. అతని ప్రేమనూ విధేయతా గుణాన్నీ ఎక్కువగా మననం చేసికోవాలి.

సైనికులు చీట్లు వేసికొని క్రీస్తు వస్రాలను పంచుకొన్నారు – 27,85. మామూలుగా నల్లురు సైనికులు ద్రోహిని తమ మధ్యన నడిపించుకొని పోయి సిలువ వేసేవాళ్ళ ద్రోహి దుస్తులు వారికే ముట్టేవి. యూదుల దుస్తులు ఐదు. అవి చెప్పలు, నడికట్టు, తలపాగా, లోపలి వస్త్రం, వెలుపలి అంగీ. వీటిల్లో వెలుపలి అంగీ ఎక్కువ విలువైంది. దీన్ని మినహాయించి నల్లరు నాలు వస్తువులను తలావొకటి చొప్పన తీసికొన్నారు, ఐదవదీ విలువైనదీ ఐన వెలుపలి అంగీకొరకు చీట్ల వేసికొన్నారు, ఈ సందర్భంలో

"వాళ్లు నా బట్టలను తమలోతాము పంచుకొన్నారు
నా దుస్తుల కొరకు చీట్లు వేసికొన్నారు"