పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 280 P.pdf/126

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అతడు రాజే. కాని అతని రాజ్యం ఈలోక సంబంధమైనదికాదు. అతడు సేవలు చేయించుకొనే రాజు కాదు. సేవలు చేసే రాజు. అనేకుల కొరకు తన ప్రాణాలు ధారపోసే రాజు - 20,28. తన పునరుత్తానం తర్వాత అతడు ఈ విశ్వానికంతటికీ రాజవుతాడు. కడన సైనికులు క్రీస్తుని సిలువ వేయడానికి తీసికొనిపోయారు - 27,31.

సిలువ మరణం మహా క్రూరమైంది. దీన్ని మొదట పర్యా దేశీయులు ప్రారంభించారు. అక్కడినుండి అది ఆఫ్రికాలోని కార్లేజీకి ప్రాకింది. అక్కడినుండి రోమను సామ్రాజ్యంలోకి వ్యాపించింది. కాని రోమియులు తిరుగుబాటు చేసినవాళ్ళకూ బానిసలకూ మహా ద్రోహాలకూ మాత్రమే ఈ శిక్ష విధించేవాళ్లు రోమను పౌరులను ఎవరినీ సిలువ వేయడానికి వీల్లేదు.

మామూలుగా కొరడాలతో కొట్టించిన పిదప దోషిని సిలుప విూదికి ఎక్కించేవాళ్లు కొరడా దెబ్బలకు అతని దేహం ఓ మాంసపు మద్దగా తయారయ్యేది. ఈముద్ద సిలువపై వేలాడేది. ఈగలు, దోమలు రోగిపై క్రమ్మకునేవి. వాటిని తోలుకోవడానికి కూడ అతనికి వీలయ్యేది కాదు. ఆకలి దప్పలతో కృశించిపోతూ, ఫరోరవ్యధ ననుభవిసూ, సిలువపై వ్రేలాడేవాళ్లు అందరినీ శపించేవాళ్చు. తమకు జన్మనిచ్చిన తల్లిదండ్రులనుగూడ శపించేవాళ్లు, సిలువ దగ్గరికి వచ్చినవాళ్ళపై కోపంతో ఉమ్మివేసేవాళ్లు, క్రీస్తు మన కొరకు ఈలాంటి సిలువ మరణానికి గురయ్యాడు, తన మరణం ద్వారా మన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసాడు.

6. క్రీస్తుని సిలువ వేయడం

ప్రధానార్చకులు పిలాతు మొదలైన వాళ్ళంతా క్రీస్తు మిూద వచ్చిన నేరాలను పరిశీలించి చూచారు. అతన్ని సిలువ వేయాలని నిర్ణయించారు. క్రీస్తుని పిలాతు నివాసం నుండి వెలుపలికి తీసికొని వచ్చారు. అక్కడ గొల్గొత్తా కొండదగ్గర అతన్ని వధించారు. ఈ భాగంలో రెండంశాలున్నాయి. 1) క్రీస్తుని సిలువ వేసి హేళన చేయడం - 27,3244, 2) క్రీస్తు మరణం - 27, 45-56. ఇక ఈ రెండంశాలను క్రమంగా పరిశీలిద్దాం.

1. సిలువ వేసి హేళన చేయడం - 27,32-44

పిలాతు సైనికులు క్రీస్తుని నగర ప్రాకారాల వెలుపలికి తీసికొని పోయారు - 27,32. దోషిని పవిత్ర నగరంలో వధించకూడదు. దుష్టులైన కౌలుదార్ల కథలో కౌలుదార్లు భూస్వామి కుమారుని ద్రాక్షతోట వెలుపల పడవేసి చంపారు - 21,39. ఈ కథలోని కుమారుడు క్రీస్తే, యూదులు మెస్సీయాను నిరాకరించి నగరం వెలుపలికి నెట్టివేసారు. 117