పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 280 P.pdf/125

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

క్రీస్తుని పరిహసించారు. వీళ్లు క్రీస్తుని రాజునిగా అపహసించారు. క్రీస్తు తన దగ్గరికి అతన్ని నీవు యూదుల రాజువా అని అడిగాడు కదా! - 27, 11. ఈ כ%eסkoeJ $סחסס ప్రశ్నను ఆధారంగా జేసికొని సైనికులు ప్రభుని పరిహాసం చేసారు. ఈ పరిహాసమే ఈ ఘట్టంలోని ముఖ్యమైన అంశం.

సైనికులు క్రీస్తుని పిలాతు అంతర్భవనంలోకి తీసికొని వెళ్లారు. అక్కడ సైనిక బృందమంతా ప్రోగైంది. మామూలుగా ఓ బృందంలో 600 మంది సైనికులుంటారు. కాని అక్కడ అంతమంది వుండి వండరు. అక్కడ వున్నవాళ్లంతా క్రీస్తు చుట్టూ ప్రోగయ్యారు. ఈ సైనికులు రకరకాల జాతులకు చెందినవాళ్లు, పిలాతుకి అంగరక్షకులు. అతడు మామూలుగా కైసరయలో వసించేవాడు. గలాట జరగకుండా చూడ్డానికి పండుగలకు మాత్రం యెరూషలేము వచ్చేవాడు. ఈ సైనికులు కూడ అతనితో పాటు కైసరయ నుండి ఇక్కడికి వచ్చారు. వాళ్ళకు క్రీస్తు ఎవరో అసలు తెలియదు. అతనిపై వాళ్ళకు ప్రత్యేకమైన ద్వేషమేమి లేదు.

ఇక్కడ సైనికులు మొదట క్రీస్తుకి రాజు వేషం వేయించారు. అటుపిమ్మట అతనికి అభివందనం చేసారు. ఈ రెండు పనులు పరిహాసం కొరకే చేసారు.

వారు మొదట క్రీస్తు బట్టలను తొలగించి అతనికి ఎర్రని అంగీని తొడిగారు. ఇది రాజవస్త్రం అనుకోవాలి, అటుతరువాత అతని శిరస్సుపై ముండ్ల కిరీటం పెట్టారు. రాజుకి కిరీటం వుంటుంది కదా! ఈ కిరీటం క్రీస్తుని బాధించడానికి కాదు. గేలి చేయడానికి మాత్రమే. అతని చేతికి వెదురుకోల నిచ్చారు. ఇది రాజదండం అనుకోవాలి. ఇంతవరకు రాజు వేషం.

ఇక వాళ్లు అతనికి అభివందనం చేసిన తీరు. సైనికులు అతని ముందు మోకరిల్లి రాజా నీకు జయం అని పల్కుతూ ఎగతాళి చేసారు, ఆ మిూదట హింసకు పూనుకొని అతని మిూద ఉమ్మివేసారు. క్రీస్తు చేతిలోని కర్రను తీసికొని అతని తలపై మోదారు. ఈ చర్యలన్నీ క్రీస్తుని అవహేళనం చేయడానికే

కీర్తన 22 ఓ భక్తుని శ్రమలను వర్ణిస్తుంది. సువిశేషకారులు ఈ కీర్తనను శ్రమలనుభవించే క్రీస్తుకి అన్వయించారు. దానిలో 16వ చరణంలో "దుష్టబృందం నా చుట్టు క్రమ్మకొంది" అని వుంటుంది. ఈ దుష్టబృందం పై సైనికులే.

తర్వాత సైనికులు ఎర్రని అంగీని తొలగించి సొంత అంగీనే క్రీస్తుకు తొడిగారు. ఇది ప్రభువుని సిలువ వేసిందాకా అతని వంటి పై అలాగే వుంటుంది.

క్రీస్తు నేను యూదుల రాజునని చెప్పకొన్నందుకు రోమను సైనికులు అతన్ని ఎగతాళి చేసారు. కాని అతడు యథార్థంగా రాజే. యూదులకు అన్యజాతులకూ కూడ

116