పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 280 P.pdf/124

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

కడన పిలాతు బరబ్బాను విడుదల చేసాడు. యేసుని కొరడాలతో కొట్టించి ఆ పిమ్మట సిలువ మరణానికి అప్పగించాడు - 27,26. యూదులు బరబ్భాను ఎన్నుకొని క్రీస్తుని తిరస్కరించారు. రాజకీయ విప్లవకారుడ్డి స్వీకరించి నీతిమంతుడైన మెస్సీయాను త్రోసివేసారు. అది వాళ్ళ తప్ప,

పిలాతు క్రీస్తుని కొరడాలతో కొట్టించాడు - 27,26. మామూలుగా సిలువ వేయడానికి ముందు ద్రోహులను కొరడాలతో కొట్టేవాళ్లు, సిలువ మరణం బహువేదనా భరితమైంది, అలాంటి మరణాన్ని ఎక్కువకాలం భరించకుండా వుండడానికి ద్రోహులను ముందుగానే కొరడాలతో కొట్టి బలహీనపరచేవాళ్లు, దీని వల్ల వాళ్లు త్వరగా చనిపోయేవాళ్లు సిలువ వేదనలను ఎక్కువకాలం అనుభవించకుండా వుండేవాళ్లు,

సువిశేషం క్రీస్తు శారీరక బాధలను ఎక్కువగా వర్ణించదు. కనుక "అతన్ని కొరడాలతో కొట్టించి" అని సంగ్రహంగా చెప్పింది - 27,26.

రోమియులు కొరడాలతో కొట్టగోరిన వ్యక్తి బట్టలు విప్పివేసేవాళ్లు, చేతులు వెనక్కులాగి కట్టేవాళ్లు. అతన్ని వంగివున్న గుంజకో లేక స్తంభానికో రొమ్మువైపుగా అంటగట్టేవాళ్లు, అతనివీపు వెలుపలి వైపున వంగి వుంటుంది. ఆ వీపుపై కొరడాలతో 40 దెబ్బలదాకా బాదేవాళ్లు, ఆ కొరడాలకు ఎముక ముక్కలూ సీసం ముక్కలూ తగిలించేవాళ్లు, ఇవి వీపునుండి మాంసపు ముక్కలను చీల్చుకొని వచ్చేవి. కొరడాదెబ్బలకు దోషి వీప నజ్ఞానజ్ఞయ్యేది. నెత్తురు ధారలుగా కారేది. చాలమంది ఆ దెబ్బలకు తట్టుకోలేక అక్కడికక్కడే చనిపోయేవాళ్లు, లేదా సృహ కోల్పోయేవాళ్ళ బ్రతికి బయటపడ్డవాళ్లు పిచ్చివాళ్ళయ్యే వాళ్లు, క్రీస్తు మన కొరకు ఈలాంటి శిక్షను అనుభవించాడు.

కడన పిలాతు క్రీస్తుని సిలువ వేయడానికి శత్రువులకు అప్పగించాడు. అతడు చేతులు కడుగుకోవడంతో తన బాధ్యత తీరిపోయిందనుకొన్నాడు. కాని నిజంగానే అలా తీరిపోయిందా? క్రీస్తుకి మరణశిక్ష విధించవద్దని పిలాతు భార్య అతన్ని హెచ్చరించింది. న్యాయం అతన్ని హెచ్చరించింది. అతని అంతరాత్మే అతన్ని హెచ్చరించింది, కాని పిలాతు జనానికి దడిసి న్యాయం చెప్పలేకపోయాడు. తన బాధ్యతను నెరవేర్చలేక పోయాడు. అతడు దుషుడు కాదు. స్వీయధర్మాన్ని నిర్వహించలేని దుర్బలుడు. దయనీయుడు. నేడు మనం మాత్రం ఎదుటివారి వత్తిడికి లొంగి మన బాధ్యతలను గాలికి వదలివేయడం లేదా? న్యాయాన్ని విడనాడి అన్యాయం కోపు తీసుకోవడం లేదా?

3. ప్రభుని పరిహసించడం – 27, 27-31

యూదుల న్యాయసభ యెదుట ఆసభ సభ్యులే క్రీస్తుని పరిహసించారు - 26,67-68. అక్కడ అతన్ని మెస్సియానుగా అవమానించారు. ఇక్కడ పిలాతు సైనికులు 115