పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 280 P.pdf/123

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యూదుల ద్రాక్షతోట యజమానుని కుమారునే చంపిన దుష్టులైన కౌలుదార్లు - 21,38-89. యెరూషలేము ప్రవక్తలను పట్టి చంపే నగరం. దేవుడు పంపిన ప్రతినిధులపై రాళ్లు రువ్వే పట్టణం. కోడి రెక్కలను చాపి తన పిల్లలను కాపాడుకొన్నట్లే క్రీస్తు యెరూషలేము పౌరులను కాపాడుగోరాడు. కాని వాళ్లు అతనిమాట వినలేదు - 23,37.

ఇంకా యూదులు క్రీస్తుని చంపుతున్నారంటే భావమేమిటి? అతడు కేవలం ప్రవక్త మాత్రమే కాదు. దేవుని కుమారుడు. దేవుడు పంపిన మెస్సీయా. అతని మరణిత్తానాలు చరిత్రగతినే మార్చాయి. అతని ఉత్థానంతో దైవరాజ్యం ఆవిర్భవించింది. పూర్వ దైవప్రజ పోయి నూత్న దైవప్రజ వచ్చింది. యూదులు పోయి క్రైస్తవులు వచ్చారు, యూదులు క్రీస్తుని నిరాకరించి దైవరాజ్యాన్నికోల్పోయారు. తాము దైవప్రజగా వుండడం మానివేసారు. వాళ్ళ స్థానంలో క్రీస్తుని అంగీకరించిన క్రైస్తవ ప్రజలు వచ్చారు.

యెరూషలేము నాశమయ్యాకనే మత్తయి సువిశేషం వ్రాసాడు, క్రీ||శ|70లో రోమియులు వచ్చి యెరూషలేమని ముట్టడించారు. నగరాన్ని కాల్చివేసారు. దేవాలయాన్ని ధ్వంసం చేసారు. యూదులను చిత్రవధ చేసారు. మత్తయి ఉద్దేశం ప్రకారం, ఇది క్రీస్తుని నిరాకరించినందుకు యూదులకు దేవుడు పంపిన శిక్ష ద్రాక్ష తోట యజమానుడు దుష్టులైన కౌలుదార్లను నాశం చేసాడు. ఆ ద్రాక్షతోటను ఇతర కౌలుదార్లకు ఇచ్చివేసాడు - 21,40-41

యూద సమాజానికి బదులు క్రైస్తవ సమాజం వచ్చింది. ఐతే దేవుడు యూదులను శాశ్వతంగా నిరాకరిస్తాడా? క్రీస్తుని త్రోసివేయడం వల్ల వాళ్లు ఎప్పటికి పరలోకభాగ్యాన్ని కోల్పోతారా? యూదులు ఏరోజో ఒక రోజు పరివర్తన చెందుతారని పౌలు నమ్మాడు. ప్రభువు తన సంకల్పాన్ని మార్చుకొని తానెన్నుకొనిన వారిని త్యజించడు అని చెప్పాడు - రోమా 11,29, ఈలా స్పష్టంగా చెప్పకపోయినా మత్తయి ఉద్దేశం కూడ ఇదేకావచ్చు యూదులు ఎప్పడో వొకప్పడు క్రీస్తుని అంగీకరిస్తారని నమ్మి వుండవచ్చు.

యూదులు క్రీస్తుని నిరాకరించారు అన్నాం. కాని వాళ్ల నిరాకరణం మన అంగీకారానికి కారణమైంది. వాళ్లు నిరాకరించిన క్రీస్తుని మనం అంగీకరించాం. వాళ్లు కోల్పోయిన భాగ్యాన్ని మనం పొందాం. రాజ్యపు వారసులు వెలుపటి చీకటిలోనికి త్రోయబడ్డారు. తూర్పు, పడమరల నుండి అన్యులు అనేకులు వచ్చి పరలోక రాజ్యంలో భోజన పంక్తిలో కూర్చున్నారు - 8, 11-12. మత్తయి సువిశేషంలో ఈలాంటి లోతయిన భావాలు వున్నాయి.

114