పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 280 P.pdf/122

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కాని దానికి ముందు అతడు తన నిర్దోషత్వాన్ని నిరూపించుకోగోరాడు. కనుక ప్రజల ముందు చేతులు కడుగుకొని ఈ నీతిమంతుని సిలువ మరణానికి నేను బాధ్యుణ్ణి కాదు. మిూరే దీనికి బాధ్యులు అని చెప్పాడు -27,24.

ఇక్కడ చేతులు కడుగుకోవడమంటే నేను నిర్దోషినని తెలియజేయడం. ద్వితీయోపదేశకాండ 21, 6-8లో చేతులు కడుగుకొనే విధి వస్తుంది. పొలంలో ఏదైనా హత్య జరిగితే ఆ పొలానికి చేరువలో వున్న గ్రామప్రజలు తమ నిర్దోషత్వాన్ని తెలియజేయడానికి ఈలా చేయాలి. ఓ పెయ్యను చంపి దానిమిూద తమ చేతులు కడుగుకోవాలి. తమ అపరాధాలను మన్నింపమని దేవుణ్ణి వేడుకోవాలి. ఇంకా కీర్తన 26,6. "నేను నిర్లోషినని రుజువు చేసికోవడానికి నా చేతులు కడుగుకొని నీ బలిపీఠం చట్ట ప్రదక్షిణం చేస్తాను" అని చెప్తుంది. ఈ యాలోకనాలను బట్టి చేతులు కడుగుకోవడం నిర్దోషత్వాన్ని నిరూపించడానికి గుర్తు. కనుక పిలాతు ఇక్కడ తాను నిర్దోషినని వెల్లడి చేసికొన్నాడు. క్రీస్తు మరణానికి నేను బాధ్యుణ్ణి కాను అని స్పష్టంగా చెప్పాడు. కాని ఇక్కడ ఒక చిక్కు వుంది. చేతులు కడుగుకోవడం యూదుల ఆచారం. రోమికాయుల ఆచారం కాదు. మరి పిలాతు ఈ సందర్భంలో ఈ యూదుల ఆచారాన్ని ఏలా పాటించాడు? పైగా ఈ సంఘటనం మత్తయి సువిశేషంలో మాత్రమే వస్తుంది. కనుక దీని యాధార్థ్యాన్ని శంకింపవలసి వుంటుంది,

పిలాతు క్రీస్తు సిలువ మరణానికి నేను బాధ్యప్టికాదు అనగానే అక్కడ గుమిగూడి వున్న యూద ప్రజలంతా క్రీస్తు రక్తం మా మిూద మా బిడ్డల విూద పడును గాక అని కేకలు పెట్టారు - 27,25. ఇది యూదుల భాష. బైబుల్లో పలానా వాడి రక్తం నా మిూద పడును గాక అంటే పలానా వాడికి నేను చేసిన కార్యానికి నేనే బాధ్యుణ్ణి అని భావం - 2సమూ 1,6. అనగా ఇక్కడ యూదప్రజలు క్రీస్తు సిలువ మరణానికి మేమే బాధ్యులమని ఒప్పకొన్నారని భావం. పిలాతు క్రీస్తు సిలువ మరణానికి నేను బాధ్యుణ్ణి కాదని ప్రకటించాడు. ఐతే అతని మరణానికి మేము బాధ్యులమౌతామని యూదులు సాహసంతో పల్మారు. ఈ వాక్యం మత్తయి సువిశేషంలో మాత్రమే వస్తుంది.

ఇక్కడ ఈ వాక్యాన్ని ఉదాహరించడంలో మత్తయి ఉద్దేశం ఇది. యూదుల దేవుడు పంపిన ప్రవక్తలను చంపే ద్రోహులు. పూర్వం క్రీస్తు వారి నుద్దేశించి "నిర్దోషియైన హేబెలు హత్య మొదలుకొని జకరియ హత్య వరకు విూరు చిందించిన నీతిమంతుల రక్తాపరాధం మిరాపై పడుతుంది" అన్నాడు - 24,85, అనగా ప్రాచీన యూదులు ప్రాచీన ప్రవక్తలను చంపినట్లే ప్రస్తుత యూదులు క్రీస్తు ప్రవక్తను చంపారని మత్తయి భావం. వాళ్లు క్రీస్తు రక్తం తమపై పడాలని కోరుకొన్నారు కదా! 113