పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 280 P.pdf/116

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

క్రీస్తు మరణానికి ప్రధానార్చకులు కూడ బాధ్యులే గాని వాళ్లు ఆ బాధ్యతను అంగీకరించలేదు. యూదా తెచ్చిన పాపపు సొమ్మను గూడ అంగీకరించలేదు. యూదాకు దుఃఖం కలిగింది. నిరాశ పట్టింది. అతడు తన ఫరోరపాపానికి నిష్కృతి లేదని నిరుత్సాహం చెందాడు. ఆ నిరుత్సాహంతోనే వెళ్ళి ఉరివేసికొన్నాడు.

పూర్వం అహిటోఫెలు అనేవాడు అబ్సాలోము పక్షాన జేరి దావీదుని నాశం జేయగోరాడు. పన్నాగం వేసాడు. కాని ఆ పన్నాగం బెడిసికొట్టగా ఇంటికివెళ్ళి ఉరివేసికొని చచ్చాడు - 2సమూ 17,23. ఇక్కడ యూదా అచ్చంగా ఈ అహీటోఫెలులాగే చేసాడు.

యూదా నుండి రక్తపు సొమ్ము తీసికోవడానికి ఇష్టపడని యాజకులు కడన దాన్ని ఎత్తి తీసికొన్నారు. కాని అది యూదా ద్రోహబుద్ధితో క్రీస్తుని అప్పగించి సంపాదించిన పాపపుసొమ్ము కనుక దాన్ని కానుకల పెట్టెలో వేయగూడదనుకొన్నారు. ఐనా వాళ్లు తాము అన్యాయంగా మోసంతో క్రీస్తుని పిలాతుకు పట్టియిచ్చినందుకు ఏమి బాధపడలేదు. వాళ్ళది వట్టి కపటభక్తి.

ఆ సొమ్ముతో వాళ్లు యెరూషలేములో చనిపోయిన పరదేసులను పాతిపెట్టడానికి ఓ కుమ్మరివాని పొలం కొన్నారు. క్రీస్తు రక్తపు సొమ్ముతో కొన్న పొలం గనుక దానికి రక్తపు పొలం అని పేరు వచ్చింది. అది నేటికి గూడ - అనగా మత్తయి సువిశేషం వ్రాసేకాలానికి - అదే పేరుతో చలామణి ఔతూంది - 27,8.

సందర్భంలో మత్తయి యిర్మీయా ప్రవచనాన్ని ఉదాహరించాడు. ముప్పది వెండి నాణాలకు కుమ్మరివాని పొలాన్ని కొన్నారు అని ఆ ప్రవచనం చెప్తుంది. కాని ఈ వాక్యం యిర్మీయా ప్రవచనంలో కాక, జకర్యా ప్రవచనం 11,13లో వస్తుంది. అక్కడ ఆ ప్రవక్త అధికారులు తనకు చెల్లించిన 30 వెండి నాణాలను తాను దేవాలయ కోశాగారంలో ఉంచినట్లుగా చెప్పకొన్నాడు. కుమ్మరివాని పొలం ప్రస్తావనం మాత్రం లేదు.

యూదా దుర్మరణాన్ని గూర్చిన కథ అచ. 1,18-19లో కూడ వస్తుంది. కాని లూకా కథకీ మత్తయి కథకీ తేడాలున్నాయి. లూకా కథలో యూదాయే రక్తపు సొమ్ముతో ఓ పొలాన్ని కొనుక్కొంటాడు. అతడు ప్రమాదవశాత్తు ఆ పొలంలో జారిపడి చనిపోతాడు గాని ఆత్మహత్యచేసికోడు. క్రీస్తు రక్తాన్నిబట్టికాక యూదా సొంత నెత్తటితో తడిసినందుననే ఆ పొలానికి రక్తభూమి అని పేరు వచ్చింది. దీన్నిబట్టి యూదా దుర్మరణాన్ని గూర్చినకథ తొలిరోజులలో భిన్న సంప్రదాయాలుగా వ్యాప్తిలో వందనుకోవాలి, మత్తయి ఓ సంప్రదాయాన్ని ఎన్నుకొంటే, లూకా మరో సంప్రదాయాన్ని ఎన్నుకొన్నాడు అనుకోవాలి.

యూదా కథ మనకు చాల పాఠాలు నేర్పుతుంది. 1. యూదా పేత్రు ఇద్దరూ ప్రభువుకి ద్రోహం చేసారు. కాని పేత్రు క్రీస్తు దగ్గరికి తిరిగివచ్చాడు, నమ్మకంతో పశ్చాత్తాప