పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 280 P.pdf/117

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

పడ్డాడు, క్రీస్తునుండి మన్నింపు పొందాడు. యూదా మాత్రం క్రీస్తు దగ్గరికి రాకుండా ప్రధానార్చకుల దగ్గరికి వెళ్లాడు. నిరాశ చెందాడు. నిరాశతోనే ఆత్మహత్య చేసికొన్నాడు. పాపం చేసినవాళ్లు నిరాశ చెందకూడదు. మనం చిత్తశుద్ధితో పశ్చాత్తాపపడితే చాలు ప్రభువు ఎంత పెద్ద పాపాన్నయినా మన్నిస్తాడు. క్రీస్తు సిలువ మరణం ఎంత ఫరోర పాపాన్నయినా మన్నిస్తుంది. దాన్ని వ్యర్థం చేసేంతటి పాపం మనమేమిరా చేయలేం.

2. ధనాశ యూదాను నాశం చేసింది. ఈ యుపాయం నేడు మనకు కూడ వుంది.

3. యూదా క్రీస్తుని పట్టియిూయడం ద్వారా సంపాదించిన 30 వెండి నాణాలతో తనకు సంతృప్తి కలుగుతుందనుకొన్నాడు. కాని ఆ సొమ్ము చేతిలోకి వచ్చాక అతనికి అసంతృప్తి కలిగింది. ఆ డబ్బును వదలించుకొన్నదాకా అతనికి మనశ్శాంతి లేదు. దీన్నిబట్టి మనం ఓ సత్యాన్ని అర్ధం జేసికోవాలి. పాపంతో సంపాదించిన వస్తువు మనలను సంతోష పెడుతుందనుకొంటాం. కాని అది మనలను సంతోషపెట్టడానికి బదులుగా దుఃఖపెడుతుంది. అది మనకు అమృతంగాక విషమౌతుంది. కనుక పాపంతో ఏ వస్తువునీ దక్కించుకోగూడదు.

కట్టకడన, పేత్రుని యూదాను పరస్పరం పోల్చిచూడ్డం మంచిది. వీళ్ళిద్దరికీ చాల పోలికలున్నాయి. ఇక్కడ కొన్నిటిని పరిశీలిద్దాం. 1. ప్రభువు ఆ యిద్దరినీ సైతానులని పిల్చాడు. నీకు సిలువ మరణం వద్దన్నపుడు అతడు పేత్రుని సైతాను అని పిల్చాడు. నేనే జీవాహారాన్నని చెప్పినపుడు యూదానుద్దేశించి మిూలో ఒకడు పిశాచం అన్నాడు. 2. ప్రభువు ఆ యిద్దరితోను మిరు పడిపోతారని ముందుగానే చెప్పాడు. ఈరాత్రి కోడికూయక మునుపే నీవు నన్నెరుగనని ముమ్మారు బొంకుతావని పేత్రుతో చెప్పాడు, ప్రభూ! నిన్నుపట్టి యిచ్చేది నేనా అని అడుగగా నీవేనని యూదాతో చెప్పాడు, 3. ఆ యిద్దరూ ప్రభువుని త్యజించారు. పేత్రు ప్రథమాచార్యుని పనికత్తెతో యేసుని గూర్చి నాకు తెలియదు అన్నాడు, యూదా వెండికాసులకు గురువుని అమ్మివేసాడు. తర్వాత ఓలివు తోపులో అతన్ని శత్రువులకు పట్టియిచ్చాడు. 4 ప్రభువు ఆ యిద్దరినీ రక్షించాలని చూచాడు. ప్రథమాచార్యుని యింటిలో వుండగా ప్రభువు పేత్రువైపు చూచాడు. శత్రువులకు తన్నుపట్టియిూయడానికి రాగా యూదాను "స్నేహితుడా" అని సంబోధించి అతనిలోని మంచితనాన్ని మేల్కొలప జూచాడు. 5. ఆ యిద్దరూ తమ తప్పకి చింతించారు. పేత్రు వెలుపలికి వెళ్ళి వెక్కివెక్కి యేడ్చాడు. యూదా 30 వెండికాసులను ప్రధానాచార్యుల యొద్దకు కొనివచ్చి నేను నిర్దోషి రక్తాన్ని విూకప్పగించి పాపం కట్టుకొన్నాను అన్నాడు.