పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 280 P.pdf/115

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

ఈ సంగతులన్నీ క్రీస్తు పూర్వమే ప్రవచించాడు. మనుష్య కుమారుని యెరూషలేమలో ప్రధానార్చకులకు అప్పగిస్తారు. వాళ్లు అతనికి మరణదండనం విధిస్తారు. అతన్ని అన్యజనులకు అప్పగిస్తారు. ఆ జనులు అతన్ని సిలువ వేస్తారు - అని ప్రభువు ముందే చెప్పాడు - 20,18-19.

న్యాయసభ సభ్యులు క్రీస్తుమిూద తెచ్చిన ప్రధాన నేరం దైవదూషణం. కాని ఈ కారణానికే పిలాతు క్రీస్తుని చంపించడని వాళ్ళకు బాగా తెలుసు. కనుక వాళ్ల పిలాతు నెదుట క్రీస్తమిూద మూడు పెద్దనేరాలు మోపారు. అవి ఇవి. క్రీస్తు తిరుగుబాటు చేస్తున్నాడు. చక్రవర్తికి పన్ను చెల్లించవద్దంటున్నాడు. తానే రాజునని చెప్పకొంటున్నాడు. కాని ఈ మూడు కూడ అస్యగమైన నేరాలే - లూకా 23,2.

4. యూదా దుర్మరణం – 27,3-10

యూదా దుర్మరణాన్ని గూర్చిన కథ మత్తయి సువిశేషంలో మాత్రమే వస్తుంది. మనుష్య కుమారుని అప్పగించేవానికి అనర్ధం. అతడు పుట్టకుండా ఉండినా బాగుండేది అన్నాడు ప్రభువు - 26,24, యూదా దుర్మరణం ద్వారా ఈ వాక్యాలు అక్షరాల నెరవేరాయి.

శుక్రవారం ప్రాతఃకాలాన న్యాయసభ సభ్యులు యేసుని చంపించాలని నిర్ణయించారు. ఆ నిర్ణయం యూదాకు తెలిసింది. క్రీస్తుకి కయిఫా యింట తీర్పు జరుగుతుంటే పేత్రు లాగే యూదా కూడ ఆ దరిదాపుల్లోనే వుండి చూచాడనుకోవాలి, పేత్రు న్యాయసభ రాత్రితీర్పులో పడిపోయాడు. యూదా దాని ఉదయంతీర్పులో పడిపోయాడు,

ప్రధానార్చకులు క్రీస్తుని చంపించగోరారని తెలిసికొని యూదా “విచారించాడు" - 27,8. అతడు పేత్రు లాగా తన పాపానికి పశ్చాత్తాపపడలేదు. తన పొరపాటుకి తానే చింతించాడు. కాని ఆ చింతతో అతడు క్రీస్తు దగ్గరికి వెళ్ళలేదు. ప్రధానార్చకుల దగ్గరికి వెళ్లాడు. నేను ఈ సొమ్ముతో నిర్దోషియైన క్రీస్తు ప్రాణాన్ని విూకప్పగించాను. ఫబోరమైన పాపం చేసాను. మిూ సామ్మ మిూరు తీసికొని అతన్ని విడిపించండి అని అడిగాడు. తర్వాత పిలాతు కూడా క్రీస్తుని గూర్చి ఆ నిర్దోషి ప్రాణం విషయంలో నేను నిరపరాధిని అంటాడు - 27,24 ప్రధానార్చకులకు కావలసింది సొమ్ము కాదు, క్రీస్తు ప్రాణం. కనుక వాళ్లు యూదాతో నీ పాపానికి నీవే బాధ్యుడివి. దాని ఫలితాన్ని నీవే అనుభవించు. మేము క్రీస్తుని వదలిపెట్టం అన్నారు. యూదా దుఃఖంతో డబ్బుని వాళ్ళ ముందు విసరికొట్టాడు.