పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 280 P.pdf/107

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

కదా! - 5,9, 2. క్రీస్తుకి పేత్రు రక్షణం అక్కరలేదు. రక్షణ కావాలనుకొంటే దేవదూతల దళాలు వచ్చి అతన్ని కాపాడతాయి. 3. క్రీస్తు శ్రమల సంఘటనలన్నీ పూర్వవేద ప్రవక్తలు చెప్పినట్లుగానే జరుగుతాయి. వాటిని అలా జరగనీయవలసిందే, ఎవరూ వాటిని ఆపలేరు. ప్రవచనాలు క్రీస్తునందు పరిపూర్ణంగా నెరవేరాలి.

కడన క్రీస్తు జన సమూహాన్ని మందలించాడు, వాళ్లు కత్తులతో గుదియలతో పెద్ద కోలాహలంతో క్రీస్తుని పట్టుకోడానికి వచ్చారు. ఇంత ఆర్భాటమెందుకు? రోజూ అతడు దేవాలయంలో బోధిస్తూ వారికంట పడుతూనే వున్నాడు కదా? ఐనా అప్పడు వాళ్లు అతన్ని పట్టుకోలేదు. ఎందుకు? అతనికి ప్రజాదరణం వుంది. అతన్ని బహిరంగంగా బంధిస్తే జనం ఊరుకోరు. ఇప్పడు మాత్రం అతన్ని రహస్యంగా బంధిస్తున్నారు. పూర్వవేద ప్రవచనాలు నెరవేరడానికే ఈ కార్యం ఈలా జరిగింది. క్రీస్తు నందు ప్రవచనాలు నెరవేరాయి అనే అంశాన్ని మత్తయి మళ్ళీ మళ్ళీ పేర్కొంటాడు.

శత్రువులు క్రీస్తుని బంధించగానే శిష్యులంతా భయపడి పారిపోయారు - 26,56. శోధనకు లొంగకుండా వుండడానికి మేల్కొనివుండి ప్రార్ధన చేయమని ప్రభువు వారిని ఆదేశించాడు. ఐనా వాళ్లు ఆ కార్యం చేయలేదు. కనుక ఇప్పడు శోధనకు తట్టుకొనే బలం వాళ్ళకు లేదు. కావున శత్రువులకు దడిసి క్రీస్తుని విడనాడి పారిపోయారు.

ప్రభువు శత్రువులకు చిక్కిపోయాడు. అతని శ్రమలు ప్రారంభమయ్యాయి. ఇక అతని మరణ సంఘటనలు ఒకదాని తర్వాత ఒకటి చరాచరా సాగిపోతాయి.

4. న్యాయసభ తీర్పు - 26,57-27,10

గురువారం రాత్రి క్రీస్తుని బంధించి ప్రధానార్చకుని యింటికి తోసికొని పోయారు. కయిఫా ముందు క్రీస్తు నేనే మెస్సీయాననీ దైవ కుమారుడననీ ధైర్యంగా ప్రకటించాడు. పేత్రు యూదా అలా ప్రకటించలేకపోయారు. యూదుల న్యాయ సభ క్రీస్తుని చంపించ గోరింది. పిలాతు అతనికి మరణశిక్ష విధించాడు. ఈ భాగంలో నాల్గంశాలున్నాయి. 1) యూదుల న్యాయసభ క్రీస్తుని పరిశీలించడం - 26,57-68. 2) పేత్రు క్రీస్తుని ఎరుగనని బొంకడం - 26,69-75, 3) న్యాయసభ క్రీస్తుని చంపించాలని నిర్ణయించడం = 271-2, 4) యూదా దుర్మరణం - 27,3-10, 85 க் నాల్గంశాలను క్రమంగా పరిశీలిద్దాం.

1. న్యాయసభ క్రీస్తుని పరిశీలించడం 26,57-68

క్రీస్తు తీర్పు మూడు భాగాలుగా జరిగింది. మొదటి భాగంలో యూదుల న్యాయసభ అతన్ని పరిశీలించింది. ఇది గురువారం రాత్రి జరిగింది - 26,57-68.