పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 280 P.pdf/106

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

2.శత్రువుల చేతిలో ప్రభువు - 26,47-56

ప్రభువు శిష్యులను నిద్ర లేపుతూండగానే యూదా పెద్ద జనసమూహంతో వచ్చాడు. వాళ్ళను ప్రధానార్చకులు పంపారు. ఈ సంఘటనం ఈలా జరుగుతుందని క్రీస్తుకి ముందుగానే తెలుసు. కనుకనే అతడు నాగడియ సమిూపించింది, నన్ను పట్టియిచ్చేవాడు సమిూపంలోనే వున్నాడు అని ముందుగానే చెప్పాడు. శత్రువులు సమిపించినపుడు గూడ క్రీస్తు రీవినీ గాంభీర్యాన్ని కోల్పోలేదు.

యూదా ద్రోహబుద్ధితో వచ్చాడు. నేను ముద్దు పెట్టుకొనేవాణ్ణి విూరు బంధించండి అని అతడు ముందుగానే జనసమూహానికి ఆనవాలు ఇచ్చాడు. రబ్బయిల శిష్యులు గౌరవసూచకంగా తమ గురువులను ముద్దు పెట్టుకొనేవాళ్లు, కనుక బయటికి గౌరవాన్ని చూపిస్తున్నట్లు నటిస్తూ యూదా గురువుని ముద్దుపెట్టుకొన్నాడు. అతని హృదయం మాత్రం విషంతో నిండివుంది. దుర్మార్డులు లోపల ఒకటి పెట్టుకొని బయటికి ఇంకొకటి చెప్తుంటారు.

మనమయితే ఈలాంటి సందర్భంలో యూదా విూద విరుచుకుపడతాం. నీవు తేనె పూసిన కత్తివని చెడాబడా తిడతాం. కాని క్రీస్తు ఇక్కడ సంయమనాన్ని కోల్పోలేదు. అతడు గురుద్రోహిని స్నేహితుడా అని సంబోధించాడు. నీవు వచ్చినపని కానీయి అని చెప్పాడు, అనగా ఓయి నీవు ఈ ముద్దులాంటి బాహిర క్రియలతో కపట నాటకాలు ఆడ్డమెందుకు? పనికి పూనుకో. నన్ను వెంటనే పట్టియిూయి అని భావం.

క్రీస్తు యూదాతో మాట్లాడి చాలించిందాకా జనసమూహం అతని విూద చేయి వేయలేదు. అతడు సంభాషణం చాలించిన పిదపనే వాళ్లు అతన్ని పట్టుకొన్నారు. ప్రభువుకి జరగబోయే సంఘటనలన్నీ ముందుగానే తెలుసు. అతడు నిస్సహాయుడై ఆ సంఘటనలకు లొంగిపోడు. తానే వాటిని నడిపిస్తూంటాడు. వాటిని అదుపులో పెట్టుకొంటూంటాడు. ఠీవి, గాంభీర్యం, హుందాతనం అతనిలో ఎప్పడూ కొట్టవచ్చినట్లుగా కన్పిస్తుంటాయి.

ప్రధానార్చకులు పాసపండుగ సమయంలో క్రీస్తుని బంధించకూడదనుకొన్నారు. కాని యూదా అతన్ని పాస్క తిరునాళ్ల సందర్భంలోనే రహస్యంగా బంధించే మార్గం చూపించాడు. కనుక శత్రువులు తమ ప్రణాలికకు విరుద్ధం గానే ప్రభువుని పట్టుకొన్నారు.

జనం క్రీస్తుని పట్టుకోగా పేత్రు ఆవేశంతో ప్రధానార్చకుని చెవిని తెగనరికాడు. అతని పేరు మాల్కుస్. కాని ప్రభువు పేత్రుని కత్తిదించమన్నాడు. ఇందుకు అతడు మూడు కారణాలు చూపాడు. 1. కత్తిని ఎత్తేవాడు కత్తితోనే మరణిస్తాడు. హింసకు పూనుకొనేవాడు హింస వల్లనే నశిస్తాడు. ఇది వో సామెత, క్రీస్తు హింసను ఎంతమాత్రం అంగీకరించలేదు. అతడు నీ కుడి చెంపపై కొట్టినవానిని నీ ఎడమ చెంపమిూద కూడ కొట్టనీయమని బోధించాడు