పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 280 P.pdf/103

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

క్రీస్తు ప్రార్థనలోని ముఖ్యాంశాలు రెండు. మొదటిది, దేవుణ్ణి తండ్రిగా భావించి చనువుతో తండ్రీ అని పిల్వడం. రెండవది, దేవుని చిత్తానికి లొంగడం.

ఈ సందర్భంలో లూకా సువిశేషం మత్తయి సువిశేషంలో లేని అంశాలను రెండింటిని పేర్కొంటుంది — లూకా 22,43-44. మొదటిది, స్వర్గం నుండి ఓ దేవదూత దిగివచ్చి క్రీస్తుని బలపరచాడు. ఇక్కడ దేవదూత చేసిన పని దైవవరప్రసాదాన్ని కొనిరావడమే. తండ్రి క్రీస్తు ప్రార్థనను ఆలించి అతనికి వరప్రసాద బలాన్ని దయచేసాడు. ఈ బలంతో అతడు తండ్రి చిత్తానికి లొంగివుండగలడు. తండ్రి నిర్ణయించినట్లుగా సిలువ మరణాన్ని అంగీకరించగలడు.

రెండవది, క్రీస్తు చెమట రక్తబిందువుల్లాగ బొట్టుబొట్లుగా కారి భూమిమిూద పడింది. మన జపపుస్తకాలు వర్ణించినట్లుగా ప్రభువు ఇక్కడ రక్తచెమట చెమర్చలేదు. అతని చెమట రక్తబిందువల్లాగ బొట్లబొట్లగా కారి నేలమిూద పడింది, అంతే. చెమట బిందువులకు రక్తబిందువులు కేవలం ఉపమానం మాత్రమే. ప్రభువు ఇక్కడ మరణంతో పోరాడుతున్నాడు. ఆ పోరాటం పందెంలో ఆటగాడు, యుద్ధంలో సైనికుడు పోరాడినట్లుగా వుంటుంది. ఈ పోరాటంలో కలిగిన శ్రమవల్ల అతడు మామూలు చెమటనే చెమర్చాడు. ఆ చెమట బిందువులు రక్తబిందువల్లాగా కారి నేలమిూద పడ్డాయి. ఇది లూకా ఉద్దేశించిన భావం. క్రీస్తు రక్తచెమట చెమర్చలేదు అంటే, ఆ ప్రభువు శ్రమలపట్ల మనకు భక్తి సన్నగిల్లిపోయినట్లు కాదు. మన కొరకు అసువులు బాసిన ప్రభువు పట్ల మనకు ఎప్పుడూ భక్తి వుండవలసిందే.

మొదటిసారి ప్రార్థన చేయడం ముగించాక క్రీస్తు ముగ్గురు శిష్యుల దగ్గరికి వచ్చాడు. కాని వారు నిద్రలో వున్నారు. ఇది కేవలం శారీరకమైన నిద్ర మాత్రమే కాదు. ఆధ్యాత్మికమైన నిద్రకూడ ప్రభువు సమయం ఆసన్నమైంది. నరజాతి రక్షణం అతని మరణోత్థానాల మిూద ఆధారపడి వుంది. అతని మరణకాలంలో పిశాచం తన శక్తిని బలంగా చూపుతుంది. ఈ ముఖ్య సమయాన్ని శిష్యులు గుర్తించడం లేదు. ప్రార్ధన చేసుకుని కష్ట సమయానికి సిద్ధం కావడం లేదు. అవివేకంతో కునుకు తీస్తున్నారు. కనుక ఈ విషమ సమయంలో వాళ్ళు తప్పక కూలిపోతారు. పిశాచ శోధనకు లొంగిపోతారు. ఏమి శోధన? క్రీస్తు శోధన పిత చిత్తానికి లొంగకుండా వుండటం. అతడు ప్రార్థన చేసికొని ఆ శోధనను జయించాడు. శిష్యుల శోధన క్రీస్తు మరణ కాలంలో అతనికి అండగా నిల్వకపోవడం, వాళ్లు గూడ ప్రార్ధన చేసికొని ఆ శోధనను జయించాలి. కనుక ప్రభువు వారిని మేల్కొనివుండి జాగ్రత్తగా ప్రార్ధనం చేసికొమ్మని హెచ్చరించాడు.

ఆత్మ ఇచ్చగించినా దేహం దుర్భలంగా వుంది అన్నాడు క్రీస్తు — 26,41. ఇక్కడ ఆత్మ అంటే ఆధ్యాత్మిక మానవుడు. దేహం అంటే పాపపు మానవుడు, నరుల్లో