పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 280 P.pdf/102

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

పరిపూర్ణింగా నరుడు కూడ. నరులందరికీ మరణమంటే భయం, దుఃఖం, అనిష్టం కలుగుతాయి. కనుక క్రీస్తుకి కూడ తన మరణం భయం, అనిష్టం కలిగించింది. ఈ యనిష్టమే అతనికి ఆవేదన కలిగించింది. ముప్పది మూడేండ్ల యిూడున చనిపోవడానికి ఎవరిష్టపడతారు?

క్రీస్తు శిష్యులతో మిూరు నాతో జాగరణం చేయండి అని పల్మాడు - 26,38. అనగా నాతో మేల్కొని ఉండండని భావం. ఎందుకు? క్రీస్తు సమయం ఆసన్నమైంది - 26,28. అనగా క్రీస్తు మరణకాలం సమిపించింది. అతని మరణోత్దానాల ద్వారానే మనకు రక్షణం. కనుక ఈ ముఖ్య సమయంలో శిష్యులు మేల్కొని ఉండాలే గాని నిద్రపోగూడదు. ఆ చివరి క్షణాల్లో క్రీస్తుకి అండగా ఉండడం వాళ్ళ పూచీ, మెలకువతో వండండి. ఆ దినంగాని, గడియ గాని విూ రెరుగరు - 25,13,

క్రీస్తు నేల విూద చాగిలపడి తండ్రీ! సాధ్యమైతే ఈ పాత్రను నానుండి తొలగించు అని ప్రార్థించాడు -26,39. బైబులు భక్తులు భగవంతుని పట్ల తమకు గల గౌరవభావాన్నీ ఆరాధాన భావాన్నీ సూచించడానికి నేలమిూద చాగిలపడేవాళ్లు, క్రీస్తుకూడ ఇక్కడ అలాగే చేసాడు. ప్రభువు పరలోక పితను తండ్రీ అని పిల్చాడు. మనం దేవుణ్ణి తండ్రీ అని పిల్వాలనే అతడు పరలోక జపంలో నేర్పించాడు. తాను నేర్చిన సూత్రాన్ని ఇక్కడ తానే పాటించాడు - 6,9. పరలోక జపానికీ గెత్సెమనీ ప్రార్థనకీ దగ్గరి సంబంధం వుంది. పితకూ క్రీస్తుకీ తండ్రీ కుమారుల సంబంధం వుంది. క్రీస్తుకి తండ్రిపట్ల నమ్మకమూ విధేయతాగుణమూ వున్నాయి. పూర్వ వేదంలో యిప్రాయేలు ప్రజలంతా కలసి దేవుని కుమారుడు. ఇక్కడ క్రీస్తు తండ్రికి విధేయుడైన యిస్రాయేలు, స్వీయ మరణానికి గూడ జంకకుండ తండ్రి నిర్ణయించిన రక్షణ మార్గాన్ని సాధించే యిప్రాయేలు. కనుక ఈ మరణకాలంలో గూడ అతడు తండ్రికి నమ్మదగిన కుమారుడుగానే ప్రవర్తించాడు.

క్రీస్తు ఈ పాత్రను తొలగించు అని తండ్రికి మనవి చేసాడు. యూదుల భాషలో మన పాలబడేది ఏదైనా “పాత్రే". అది కష్టమూ గావచ్చు సుఖమూ గావచ్చు. ఇక్కడ సిలువ మరణమే పాత్రం - 20,22-23.

ప్రభువు నా చిత్తం కాదు, నీ చిత్తమే నెరవేరనీయి అని తండ్రిని వేడుకొన్నాడు - 26,39. నరుడు కష్టసుఖాల్లోను దేవుని చిత్తానికి లొంగాలి, తన చిత్తప్రకారం తాను ప్రవర్తించకూడదు. పరలోక జపంలో ప్రభువు "నీ చిత్తం పరలోకంలో నెరవేరినట్ల భూలోకంలోను నెరవేరును గాక" అని తండ్రికి ప్రార్థన చేయమన్నాడు. ఆ నియమాన్ని ఇక్కడ తానే పాటించాడు. మనం తరచుగా దేవుని చిత్తానికి లొంగం. అసలు దైవచిత్తం ఒకటుందని కూడ మనకు తెలియదు. కనుకనే సులువుగా పాపంలో పడిపోతూంటాం.