పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 279 P.pdf/59

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పరమ పవిత్రమైన మోక్షపథంనుండి,
మహిమాన్వితమైన నీ సింహాసనం నుండి
జ్ఞానాన్ని నాయొద్దకు పంపు
అది నాతోగలసి పనిచేయునుగాక
దాని సాయాన నీకు ప్రియమైనదేదో
నేను తెలిసికొందునుగాక
అది అన్నిటిని ఎరుగును
నేను చేసే పనులన్నిటిలో నాకు త్రోవ చూపుతుంది
దాని శక్తినన్ను కాపాడుతుంది.

జ్ఞానాన్ని పొందినవారు దేవునికి ప్రీతి కలిగించే పనులు చేసి విజయాన్ని సాధిస్తారని ఈ వాక్యాల భావం.

4. ఆతిథేయగా, ఉపధ్యాయగా జ్ఞానం

సామెతల గ్రంథం జ్ఞానాన్ని థేయగాను, ఉపాధ్యాయగాను చిత్రిస్తుంది - 9,1-6. జ్ఞానమనే స్త్రీమూర్తి తన భవనాన్ని నిర్మించి ఏడు స్తంభాలను నెలకొల్పింది ఆమె వేటమాంసం వండి సుగంధ ద్రవ్యాలు కల్పిన ద్రాక్లాసవం సిద్ధంచేసి భోజన పదార్ధాలు తయారుచేసింది వివేకహీనునికి ఆమె యిూలా కబురు పంపింది రా, నేను తయారుచేసిన భోజనాన్ని ఆరగించు నేను సిద్ధంచేసిన ద్రాక్షాసవాన్ని సేవించు మూర్ఖత్వాన్ని విడనాడితే నీవు బాగుపడతావు నీవు విజ్ఞానపథాన నడువు.

ఇక్కడ రచయిత జ్ఞానాన్ని నరుణ్ణి భోజనానికి ఆహ్వానించే ఆతిథేయనుగా చిత్రించాడు. ఈ యాతిథేయ వడ్డించే భోజనం ఏమిటి? జ్ఞానమే. ఆమె వివేకాన్ని బోధించే ఉపాధ్యాయ 8,4 -10.

నరులారా! నేను మిమ్ము ఆహ్వానిస్తున్నాను
నేలమీది జనులందరికి విజ్ఞప్తి చేస్తున్నాను
అజ్ఞానులారా! మీరు జ్ఞానాన్ని ఎరుగండి