పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 279 P.pdf/60

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మందమతులారా! మీరు వివేకాన్ని అలవర్చుకోండి
నేను ఉదాత్త సత్యాలనే బోధిస్తాను
నా పెదవులనుండి సత్యవాక్కులేగాని వెలువడవు
మీరు వెండిని విడినాడి నా ఉపదేశాన్ని అంగీకరించండి
బంగారాన్ని వదలుకొని విజ్ఞానాన్ని పొందండి.

పైన మనం చూచిన జ్ఞానమనే స్త్రీమూర్తి భగవంతుడే. అతని వరప్రసాదమే. జ్ఞానగ్రంథాలు భగవంతుని శక్తినే ఫ్రీమూర్తినిగా వర్ణించాయని ముందే చెప్పాం.

11. స్త్రీమూర్తిగా దేవుని ఆత్మ

హీబ్రూలో ఆత్మకు రువా అనిపేరు. ఇది స్త్రీలింగం. కనుక యూదులు దేవుని ఆత్మను స్త్రీమూర్తినిగా భావించారు. ఈయాత్మ దేవుని ఊపిరి లేక జీవశక్తి ఇంకా అతని క్రియాశక్తిగూడ. ఈ శక్తివల్లనే లోకంలోని ప్రాణులన్ని జీవిస్తున్నాయి, పనిచేస్తున్నాయి.

భగవంతుని జీవ, క్రియాగుణాలనే బైబులు ఆత్మ అంటుంది. ఆత్మ స్త్రీలింగం గనుక దానికి ఆలవాలమైన దేవుణ్ణగూడ స్త్రీమూర్తినిగా భావిస్తుంది. కనుక ఆత్మ అంటే స్త్రీరూపంలో ఉన్నదేవుడే.

ఆత్మ ఏం చేస్తుంది? అది ఆదిమ జలాలమీదికి ఎగిరి వాటిలో ప్రాణికోటిని పుట్టించింది - ఆది 1.2. దేవుడు తన ఊపిరిని (ఆత్మను) మట్టిముద్దలోనికి ఊదగా అది జీవించే ప్రాణి ఐంది. అతడే ఆదాము - ఆది 2,7. ప్రభువు తనకు ఎదురుతిరిగే యిస్రాయేలీయుల మీదికి తన ఆత్మను పంపుతాడు. వారిలోని రాతిగుండెను తొలగించి మాంసపు గుండెను దయచేస్తాడు. అనగా అవిధేయులైన యూదులను విధేయులనుగా మారుస్తాడు -యేహె 36, 26-28. కనుక యిస్రాయేలీయయుల హృదయాలను మార్చి వాళ్ళ నైతికంగా విశుద్ధజీవితం గడిపేలా చేసేది ఆత్మే ఈ యాత్మహృదయ పరివర్తనానికీ, నూత్నత్వానికీ చిహ్నం. ప్రవక్తలను ప్రేరేపించింది దేవుని ఆత్మే అంత్యకాలంలో ప్రభువు నరులందరిమీద ఈ యాత్మను కుమ్మరిస్తాడు - యోవేలు 2,28-29. పెంతెకోస్టు దినాన ఈ ప్రవచనం నెరవేరింది. నేడు నరులందరినీ నడిపించేది ఆత్మే - కీర్తన 143,10. ఈవిధంగా బైబులు దేవుని ఆత్మద్వారా దేవుణ్ణి స్త్రీమూర్తినిగా చిత్రిస్తుంది.

12. స్త్రీమూర్తిగా దేవుని సాన్నిధ్యం

దేవునిసాన్నిధ్యానికి హీబ్రూలో పెక్రీనా అని పేరు, ఈ పదంకూడ స్త్రీలింగం, ఇదికూడ దేవుణ్ణి సూచించేదే. కనుక స్త్రీమూర్తిగా నరులమధ్యలో ఉన్న దేవుడు లేక