పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 279 P.pdf/58

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నేను ప్రధాన శిల్పివలె అతని చెంత నిల్చివున్నాను
పసికందువలె రోజురోజు అతనికి
ఆనందం చేకూరుస్తూ
నిత్యం అతని సన్నిధిలో ఆటలాడుకొనేదాన్ని.

ప్రభువు లోకసృష్టి చేస్తుండగా జ్ఞానం దేవునితోపాటు తానూ ఆ సృష్టిలో పాల్గొంది. శిల్పి భవనాన్ని నిర్మించినట్లుగా ఆమె లోకసృష్టిని చేసింది. కనుక ఆమె సృష్టికర్షి జ్ఞానానికి దేవునితోను, లోకంతోను, నరులతోను ఉండడమంటే ప్రీతి. ఆమె దేవునిగూర్చి లోకాన్ని గూర్చి నరులకు తెలియజేస్తుంది. కనుకనే తాను "ప్రభువు చేసిన భూమిమీద క్రీడిస్తూ ప్రమోదంతో మానవాళిమధ్య వసిస్తూ వచ్చాను" అని చెప్పకొంది -81.

2. తల్లిగా జ్ఞానం

సీరా గ్రంథం జ్ఞానాన్ని తల్లితో పోలుస్తుంది - 15,1-6.
దైవశాస్త్ర పారంగతుడ్రు జ్ఞానాన్ని పొందుతాడు
విజ్ఞానం తల్లివలె వచ్చి అతన్ని ఆహ్వానిస్తుంది
అది అతనికి తెలివిడి అనే అన్నం పెడుతుంది
వివేకం అనే పానీయం ఒసగుతుంది
అతడు ఊతకర్రమీదలాగ దానిమీద వాలి నడవాలి
ఏనాడు క్రిందపడిపోడు.

ధర్మశాస్రాన్నితెలిసికొని పాటించేవాణ్ణిజ్ఞానం ప్రేమిస్తుంది. తల్లిలా వచ్చి అతనికి అన్నపానీయాలు అందిస్తుంది. వివేకం, తెలివి అనేవే ఆ యాహార పదార్థాలు. ఆమీదట అతడు తెలివితేటలతో సమాజంలో బాగా రాణిస్తాడు.

3. వధువుగా జ్ఞానం

జ్ఞానియైన సోలోమోనురాజు దేవునినుండి జ్ఞానాన్నిభార్యనుగా పొందగోరాడు. - సొలోమోను జ్ఞానం - 8,2.

నేను జ్ఞానాన్ని ప్రేమించాను
బాల్యం నుండి దానికొరకు గాలించాను
దానిని నా వధువుని చేసికోగోరాను
దాని సౌందర్యానికి ముగ్ధుడనయ్యాను.

ఆరాజు జ్ఞానంకొరకు ప్రభువుకి ఈలా ప్రార్ధనం చేసాడు 9, 10-11. మా పితరులకు దేవుడవైన ప్రభూ!