పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 279 P.pdf/52

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

4. గాఢమైన ప్రేమానురాగాలతో
నేను వారిని నా చెంతకు రాబట్టుకొన్నాను
వారిని పైకెత్తి నా బుగ్గలకు ఆనించుకొన్నాను
క్రిందికి వంగి వారిచే అన్నం తినిపించాను
ఐనా వాళ్ళు నా వద్దకు రావడానికి అంగీకరించడంలేదు.

ప్రభువనే తల్లి యిస్రాయేలు బాలుణ్ణి ప్రేమించి ఈజిప్టునుండి పిలువనంపింది. కాని ఆ బాలుడు యావే పిలిచేకొలది వెనక్కిపోయాడు. బాలు దేవతను ఆరాధించాడు. కాని యావే అతన్ని మన్నించాడు. తల్లిలాగ ఆ బాలుడికి నడవడం నేర్పాడు. అతన్నిచేతుల్లోకి తీసికొన్నాడు. గాఢమైన ప్రేమతో దగ్గరికి రాబట్టుకొన్నాడు. వాత్సల్యంతో పైకెత్తి బుగ్గలకు ఆనించుకొన్నాడు. తల్లిలాగ క్రిందికివంగి ఆ బిడ్డకు అన్నం తినిపించాడు. ఐనా ఆ బాలుడు యావే అనే తల్లిపట్ల ప్రేమ చూపలేదు. కావున యావే ఆ బాలుని విసర్జింపవచ్చుకదా? అనగా యిప్రాయేలును పరిత్యజింపవచ్చుకదా? ఐనా ప్రభువు అలా చేయలేదు. ఈ పట్టున ప్రవక్త చెప్పిన వాక్యాలు ఇవి – 11, 8–9.

యిస్రాయేలూ! నేను నిన్నెట్లు విసర్జించేది
నిన్నెట్లు పరిత్యజించేది?
నా హృదయం అందులకు అంగీకరించడంలేదు
నా యెడద జాలితో కంపిస్తుంది
నేను కోపంతో మిమ్ము శిక్షింపను
యిప్రాయేలును మరల నాశం చేయను
నేను దేవుణ్ణికాని నరుడనుగాను
నేను మీ నడుమనుండే పవిత్రమూర్తిని
నేను మీ చెంతకు కోపంతో రాను.

ఇవి చాల నెనరుగల పలుకులు. యావే అనే తల్లికి యిస్రాయేలును నాశం చేయడానికి చేతులు రావడంలేదు. పూర్వం వేదంలోని పెద్ద పాపం విగ్రహారాధనం. ఈ దోషానికి పాల్పడినందులకు దేవుడు ఆ ప్రజలను నాశం చేయవలసింది. ఐనా జాలి అతనికి అద్దమొచ్చింది. వారిని శిక్షించాలంటే అతని హృదయం కంపించిపోయింది. బిడ్డడు దుషుడైతేమాత్రం తల్లి వాడ్డి నాశంజేస్తుందా? నరుల్లాగా దేవుడు సులభంగా కోపతాపాలకు గురై శిక్షకు పూనుకొంటాడా? పవిత్రుడైన ప్రభువు తన ప్రజను శిక్షింపడు గదా, రక్షిస్తాడు.

సంఖ్యాకాండం కూడ దేవుణ్ణి బిడ్డను సంరక్షించే తల్లితోను దాదితోను పోలుస్తుంది - 11, 11-15. యిప్రాయేలీయులు ఎడారి ప్రయాణంలో కిబ్రోతు హట్టావా అనే