పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 279 P.pdf/51

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నా హృదయం నీపై వలపుకొంటూంది
నేను నీమీద తప్పక కరుణ చూపుతాను.

అనగా రాహేలుకి బదులుగా యావే యిప్రాయేలుకు తల్లియై వారిపట్ల అంతులేని మమకారం జూపుతాడు. ఆ ప్రజలను శిక్షింపబూనినప్పడెల్ల అతనికి వారిపై ఉన్నప్రేమ అడ్డు వస్తుంది. అతని హృదయంలో యిస్రాయేలుపై అనురాగం పడుతుంది. ఇక్కడ "నా హృదయం నీపై వలపుగొంటుంది" అనే మాటలకు హీబ్రూలో "నా గర్భకోశం నీకోసం వేదనతో కంపిస్తుంది? అని వ్రాసాడు. అనగా తల్లి కష్టంలోవున్న బిడ్డకొరకు బాధపడినట్లే దేవుడు ప్రవాసంలోవున్న యూదులకొరకు బాధపడుతున్నాడని భావం. వారికొరకు తల్లిలాంటివాడైన ఆ దేవుని గర్భకోశం స్పందిస్తుందని అర్థం. అతడు వారిని శిక్షించడని ఫలితార్థం. ఇంకా "నేను నీమీద తప్పక కరుణ జూపుతాను అనే మాటలకు హీబ్రూ మూలంలో "నేను నీ పట్ల తల్లిచూపే జాలి చూపుతాను" అని వుంది. కనుక దేవుడు యిస్రాయేలీయులకు తల్లియై వారి తప్పలను మన్నించి, వారిని ప్రవాసంనుండి విడిపిస్తాడని ఫలితార్థం. ఇక్కడ ప్రవక్త దృష్టిలో యావే ప్రభువు దయగల తల్లి, అతడు కరుణగల అమ్మలా వారిని ఆదుకొని ప్రవాసం నుండి వెలుపలికి కొనివస్తాడు. ఈ భాగమంతా దేవుని మాతృగుణాన్ని వర్ణిస్తుంది.

4 సంరక్షించే తల్లిగా దేవుడు

హోషేయ ప్రవక్త క్రీ.పూ. 750 ప్రాంతంలో ప్రవచనం చెప్పాడు. అతడు యావే ప్రభువుని యిప్రాయేలనే బాలుడ్డి సంరక్షించే తల్లినిగా చిత్రించాడు - 11, 1-9. తల్లి బిడ్డకు నానా ఉపచారాలు చేసినట్లే యావే అనే తల్లి యిస్రాయేలుకు నానా సేవలు చేస్తుందని చెప్పాడు. ఇవి కూడ పూర్వవేదంలోని గొప్ప వాక్యాల్లో కొన్ని

1. ప్రభువు ఈలా అంటున్నాడు
యిస్రాయేలు బాలుడై యుండగా నేనతన్ని ప్రేమించాను
ఐగుప్శనుండి నా కుమారుని పిలిపించాను

2. కాని నేనతన్ని పిల్చిన కొలది
అతడు నానుండి నై దొలగాడు నా ప్రజలు బాలు దేవతకు బలులర్పించారు
విగ్రహాలకు సాంబ్రాణిపాగ వేసారు

3. యిప్రాయేలుకు నడవడం నేర్చింది నేనే
నేను వారిని నా చేతుల్లోకి తీసికొన్నాను
ఐనా నేను తమ్ము కరుణించానని వాళ్లు గ్రహించలేదు