పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 279 P.pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కొట్లలో నిల్వజేసికోవు. ఐనా భగవంతుడు వాటినిగూడ పోషిస్తుంటాడు - లూకా 12,24. ఇక్కడ కాకిని ప్రత్యేకంగా గమనించాలి. అది నల్లగా వుంటుంది. దానికి జూటాతనం జాస్తి. దొంగబుద్ధి ఎక్కువగా వుంటుంది. కనుక మనం దాన్ని గౌరవంతో గాని సానుభూతితోగాని చూడం. చీదరించుకొంటాం. అలాంటి క్షుద్రపక్షినిగూడ దేవుడు పట్టించుకొంటాడు. దానికి తిండిపెడతాడు. అతని ప్రాణిపోషణాచాతుర్యం అంత గొప్పది. అతడు పక్షులకు గూడ తండ్రే.

ప్రభువు ఒక్క పక్షులనేగాక చిన్న పూలమొక్కలను గూడ పట్టించుకొంటాడు. లిల్లీ మొక్కలున్నాయి కదా! అని శ్రమపడవు. నూలు వడికి వస్ర్తాలు నేసికోవు. ఐనా దేవుడు వాటికికూడ రంగురంగుల పూలనే బట్టలు తొడుగుతాడు. మహావైభవంగా జీవించిన సొలోమోను రాజుకూడ వాటి పూలంత అందమైన ಬట్టಲು ధరించలేదు. ఈ గడ్డిమొక్కలు ఇవ్వాళ్ల వుండి రేపు పొయ్యిలో కాలిపోయేవి. ఆలాంటి విలువలేని చెత్తనే పట్టించుకొనే పరమేశ్వరుడు తనకు పోలికగా వున్న నరులను ఎంతగా పట్టించుకోడు? — మత్త 6,28– 29. గడ్డి మొక్కలతో పోలిస్తే నరులమైన మన విలువ కోటిరెట్ల అదనంగాదా? అంత అల్ప వస్తువులను గూర్చి జాగ్రత్తపడేవాడు మనలనుగూర్చి ఎంతగా జాగ్రత్తపడడు? గడ్డి మొక్కలకు గూడ తండ్రియైనవాడు మనకెంతగా తండ్రికాడు?

దేవుడు మనలను గూర్చి అధికంగా జాగ్రత్తపడతాడు అంటే మనం సోమరిపోతులంగా వుండిపోవచ్చునని భావంకాదు. మన శక్తి కొలది మనం కృషిచేయాలనే ఆ ప్రభువు కోరుకొనేది ఒక లక్ష వరహాలు పొందినవాడు ఆ సొమ్మునకు తగినట్లుగా శ్రమ చేయలేదు. కనుక యజమానుడు అతన్ని శిక్షించాడు కదా! - మత్త 25,26-28. ఎప్పడూ దైవమూ పురుషకారమూ కలసి పనిచేస్తాయి.

4. దైవ కటాక్షం అందరికీ

దేవుడు నరులందరికీ మేలు చేస్తాడు. వీళ్ళు మంచివాళ్లు వీళ్ళు చెడ్డవాళ్ళు అనే భేదభావం అతనికుండదు. అతడు దుర్జనులకూ సజ్జనులకూ గూడ తన సూర్యరశ్మిని ప్రసాదిస్తాడు. సన్మార్గులకూ దుర్మార్గులకూ గూడ వరాన్ని ప్రసాదిస్తాడు. అదేవిధంగా మనంకూడ శత్రువులనూ మిత్రులనూ ఆదరించాలి - మత్త 6,44 –45.

దేవుడు అందరూ రక్షణం పొందాలనే కోరుకొంటాడు. అందరూ క్రీస్తుద్వారా తన్ను చేరుకోవాలనే వాంఛిస్తాడు. కనుక అందరికీ వుపకారం చేస్తాడు. పాపులపట్ల అతడు ప్రత్యేకంగా దయచూపుతాడు. వాళ్లు పరివర్తనం చెంది జీవాన్ని పొందాలనే అతని కోరిక, సూర్యరశ్మీ వానా ప్రాణికోటికి అత్యవసరం. కనుక దేవుడు ఈ ప్రాథమిక వస్తువులను అందరికీ దయచేస్తాడు.