పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 279 P.pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

50. ఐనా యీ కుమారుడు మనుష్యావతారంలో తండ్రికి విధేయుడు. క్రీస్తును జీవంతో లేపింది తండ్రే - ఆచ 2,24. మన రక్షణాన్ని గూర్చి మొదట ఆలోచించిందీ తండ్రే, క్రీస్తు ద్వారా లోకాన్ని తనతో సమాధాన పరచుకోవాలనుకుంది తండ్రే - 2 కొ 5,19. ఆలా అనుకొని ఆయన తన కుమారుడ్డి పంపాడు- గల 44. అతన్ని మన తరఫున సమర్పించాడు - రోమ 8,32. అతనికి ఓ పనిని అప్పగించాడు - యోహా 174. ఓ మాట చెప్పమని ఆజ్ఞాపించాడు - 12 19. ఓ మానుష జాతిని రక్షింపమని ఆదేశించాడు- 6,39. అన్నింటికీ అదీ అంతమూ ఆతండ్రే-1 కొ 8,6. కుమారుడు ఈ తండ్రిమీద ఆధారపడతాడు - 5, 19. ఆయనకు లోబడతాడు- 1కొ 15,28. తండ్రి ఆ క్రీస్తునకు శిరస్సు లేక నాయకుడు - 1 కొ 11,3. ఈలా మనుష్యావతారంలో క్రీస్తు తండ్రికి బదుడై చరిస్తాడు.

51. మన దైవపత్రత్వానికి క్రీస్తు పుత్రత్వమే కారణం. అతనిద్వారా మనం దేవుని బిడ్డలమౌతాం. తన్నుఅంగీకరించి విశ్వసించిన వాళ్లందరినీ అతడు దేవుని పత్రులను చేస్తాడు- యోహా 1, 12. ఈ క్రీస్తు తన శిష్యులను ఆలించిన వాళ్ళను తన్ను ఆలించినట్లుగానే భావిస్తాడు- మత్త 18,5. తన శిష్యులను నా సోదరులు అని పేర్కొంటాడు -28, 10 తననూ పత్రులలో ఒక్కణ్ణిగా భావించుకుంటాడు-17,27. ఈలా క్రీస్తు మన సోదరుడు. అతనిద్వారా మనం బిడ్డలమౌతాం.

52. క్రీస్తు పత్రత్వానికి మన పత్రత్వానికి గల సంబంధాన్ని చక్కగా విశదీకరించి చెప్పినవాడు పౌలు. భూలోకంలోని ప్రతి కుటుంబమూ పరలోకంలోని తండ్రినిబట్టే కుటుంబమని పిలువబడుతుంది. అనగా అందరికీ అతడే తండ్రి - ఎఫె 3, 14.

ఈ తండ్రికి సహజపుత్రుడు క్రీస్తు అన్నాం. అతడు మనలను కూడ తన తండ్రికి దత్తపుత్రులను చేస్తాడు- గల 45. క్రీస్తును నమ్మి అతనిలోనికి జ్ఞానస్నానం పొందడంద్వారా మనం అతని తండ్రికి దత్తపుత్రుల మౌతాం - గల 8,26. క్రీస్తులోనికి ఐక్యమైనపుడు అతడు మన పెద్దన్న ఔతాడు. మనమంతా అతని తమ్ముళ్ళమూ చెల్లెళ్ళమూ ఔతాం. అతడు తన వారసాన్ని మనతో పంచుకుంటాడు- రోమ 8, 17.

ఇక, క్రీస్తుద్వారా మనం పరలోకంలోని తండ్రికి దత్తపుత్రుల మయ్యేలా చేసేది ఆ క్రీస్తు ఆత్మయైన పరిశుద్దాత్మ ఈయాత్మ మనలోనికివచ్చి క్రీస్తు తన తండ్రిని నాయనా అని పిలిచినట్లే మనమూ క్రీస్తు తండ్రిని చనువుతో "నాయనా" అని పిలిచేలా చేస్తుంది - గల 4,6. ఈ యాత్మ మనలోవుండి మనం దేవుని బిడ్డలమని మన ఆత్మకు బోధిస్తుంది - రోమ 8, 15-16. మనలను దేవుని కుమారులనుజేసి దేవుని కుమారుల్లాగ మెలిగేలా చేస్తుంది - 8, 14 ఈలా దేవుడు తన కుమారుని ఆత్మనే మనకు ప్రసాదిస్తాడు. ఈ యాత్మ క్రీస్తుతండ్రిని మన తండ్రిని చేస్తుంది. ఆ కుమారునిలాగే మనమూ ఆ తండ్రిని