పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 279 P.pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వస్తాలకంటె అందమైన ఉడుపులతో అలంకరించేవాడు, కాకులు పిచ్చుకలు మొదలైన ఆకాశ పక్షులకంటె, లిల్లీమొక్కలు మొదలైన గడ్డిపోచలకంటె నరుడు యోగ్యుడుకాడా? ఈలాంటి నరుణ్ణి దేవుడు ఇంకా అధికంగా ఆదరింపడా? - మత్త 6, 25-34.

47. పరలోకంలోని దేవుణ్ణి "తండ్రీ" అని పిలచే నరులు ఆ తండ్రి గుణాల్లో ఒక్కదాన్ని విశేషంగా అనుకరించాలి. ఆయనలాగే నరులుకూడ సన్మార్డులను దుర్మార్డులను, తమ శత్రువులనుగూడ ప్రేమించాలి — మత్త 5, 44-45. శిష్యులు తమ పగవారిని క్షమిస్తుండాలి - 18, 33. వాళ్లు పరలోకమందున్న తమ తండ్రివలె పరిపూర్ణులైయుండాలి5,48 ఏమిటి యూ పరిపూర్ణత్వం? లూకా 6,36ను బట్టి ఈ పరిపూర్ణత్వం శత్రువులనుగూడ కరుణతో క్షమించడమే. దుర్మారులను తన్ను ద్వేషించేవాళ్లనుగూడ కనికరంతో క్షమించి ఆదరించడం దేవుని లక్షణం. ఆ దేవునికి బిడ్డయైన నరుని లక్షణంగూడ ఈలాగే వుండాలి. అతడూ తన పగవారిని కనికరంతో క్షమించాలి, ఆదరించాలి.

48. ఇక, యీ క్రీస్తు తండ్రికి సహజకుమారుడు. అతని పత్రత్వానికి మన పుత్రత్వానికి చాల భేదంవుంది. అందుకే అతడు మరియమగ్గలతో "నాతండ్రి మీతండ్రి అయిన దేవుని యొద్దకు ఆరోహణమై పోతున్నాను" అంటాడు - యోహా 20,18. అతడు పితకు ప్రియకుమారుడు. అనగా ఏకైక కుమారుడు - మార్కు9,7. అనగా క్రీస్తు దేవునికి సహజకుమారుడు, మనం దత్తపుత్రులము మాత్రమే. అతడు తండ్రితో ఎంత సన్నిహితంగా మెలగుతాడనగా, ఆ తండ్రి రహస్యాలను కూడ తెలిసికోగలడు - మత్త 11,25. అతడు మాత్రమే ఆ ప్రభుని "నాయనా" అని సంబోధింపగలడు - మార్కు 14,36.

49. క్రీస్తు తండ్రికి ఏకైక కుమారుడు అన్నాం - యోహా 114. కనుక అతడు తండ్రితో సన్నిహిత సంబంధం కలవాడు. వాళ్లిద్దరూ ఒకే చిత్తం చొప్పున ప్రవర్తిస్తారు - యోహా 5, 30. ఇద్దరూ కలసి పని చేస్తూంటారు- 5, 17. తండ్రి యందు కొడుకు, కొడుకునందు తండ్రి నెలకొనివుంటారు - 10,38. వాళ్ళిద్దరూ ఒకరి నొకరు ఎరిగిన వాళ్న -10, 15. ఒకరినొకరు పేమించేవాళ్ళు - 15, 10 ఒకరినొకరు మహిమపరచుకునేవాళ్లు — 17,1. అసలు వాళ్లిద్దరూ ఒకటే. "నేను నా తండ్రీ ఏకమై యున్నాము" అన్నాడు క్రీస్తు —10,30. అందుకే ఆ క్రీస్తుద్వారా తప్పితే ఎవడూ తండ్రిచెంతకు వెళ్లలేడు - 14,6. ఆలాగే తండ్రి ఆకర్షించందే ఎవడూ క్రీస్తునొద్దకు రాలేడు –6, 44 క్రీస్తు తండ్రితో సరిసమానుడు-5, 18. ఆబ్రాహాముకంటే ముందుగా, అనగా అనాదినుండే వున్నవాడు-8, 58. తండ్రి వక్షస్థలాన నెలకొని వున్నవాడు 1,18. అనగా ఆ తండ్రికి సమీపంగా వున్నవాడు, తండ్రికి తుల్యంగా వున్నవాడు. ఆ కుమారుని లక్షణాలు ఈలాంటివి. ఈ లక్షణాలు కేవలం దత్తపుత్రులమైన మనకు చెల్లవు.