పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 279 P.pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చనువుతో "నాన్నా" అని పిలిచేలా చేస్తుంది. ఆ కుమారుని వారసమైన మోక్షంలో మనకూ భాగం పంచిపెడుతుంది. దేవుడు తన కుమారునికంటే, తన ఆత్మకంటే అధికంగా మనకు ఏమీయగలడు? దత్తపుత్రులం గావడమంటే ఈ భాగ్యాలన్నీ పొందడమే.

53. గ్రీస్తు "తండ్రీ! నీ నామమం పరిశుద్ధపరచబడును గాక" అని తన తండ్రినిగూర్చి ప్రార్థించాడు. మనమూ ఆలాగే ప్రార్ధన చేయాలని నేర్పాడు. అనగా తండ్రి క్రీస్తును ఏ చూపున జూస్తాడో మనలనూ ఆ చూపుననే జూస్తాడు. దీనిలో సందియ మేమిలేదు. యోహానుకూడ "మనం దేవుని బిడ్డలమని పిలువబడుతున్నామంటే దేవుడు మనలను నెంతగా ప్రేమించాడో విచారించండి. ఔను, మనం నిజంగా దేవుని బిడ్డలమే” అంటాడు-1 యోహా 3, 1. అనగా “దేవుని బిడ్డలం" అనేది ఓ బిరుదు మాత్రమేగాదు, మనం యథార్థంగానే దేవుని బిడ్డలం. ఇక, ఎంతచెట్టుకు అంతగాలి. దేవునిబిడ్డలు దేవునిబిడ్డల్లాగే ప్రవర్తించాలి. విశేషంగా అతన్ని తండ్రిలా భావించాలి. అతనిపట్ల బిడ్డ తండ్రిపట్ల మెలగినట్లుగా మెలగాలి. నమ్మికతో అతన్ని"నాన్నా అనిపిలిచి ప్రార్ధిస్తూండాలి. అతనినుండి సహాయం పొందుతూండాలి. పైగా ఆ దేవునికోసం, ఆదేవుని బిడ్డలే ఐన తోడి ప్రజలను గూడ ఆదరిస్తూండాలి. తండ్రిని ప్రేమించే బిడ్డలు ఆతండ్రి యితర బిడ్డలను ప్రేమించకపోరు- 1 యోహా 5,1. ఈ దైవప్రేమకు గాని సోదరప్రేమకుగాని క్రీస్తే మనకు ఆదర్శం. ఆతనిలాగే మనము మంచి కుమారుల్లాగా, అనగా ప్రేమభావంతో ప్రవర్తిస్తూండాలి. ఈ భాగ్యం కోసం ప్రార్థిద్దాం.

5. గృహనిర్మాత- గృహం

54. యూదులు భగవంతుణ్ణి గృహనిర్మాతతో పోల్చారు. అతడు కట్టిన గృహం తామే అనుకున్నారు. బైబులు వాక్యాలు చాలా ఈ వుపమానాన్ని స్మరింపజేస్తూంటాయి. యాకోబు తన కొక యిల్ల కట్టుకున్నాడు - ఆది 33,17. కయీను తనకోసం ఓ నగరాన్ని నిర్మించుకున్నాడు - 4, 17. ఈలా నరులు నిర్మించిన భవనాలను దేవుడు ఆశీర్వదించేవాడు. అతని ఆశీస్సులేందే నరుడు వృద్ధిచెందడు. అతని ప్రయత్నం ఫలింపదు. అందుకే కీర్తన కారుడు" యావే యిల్లకట్టందే దాన్ని కట్టేవాళ్ళు కృతకృత్యులు కాలేరు" అంటాడు– 127, 1. ఈ భగవంతుడు తొలి మానవునికి ఓయిల్ల కట్టిపెట్టాడు. ఆయిల్లే ఏవ. "యావే నరునినుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదామునొద్దకు తోడ్కొనివచ్చాడు" - ఆది 2, 22. ఈ దేవుడే దావీదునకు ఓ యిల్ల కట్టిపెట్టాడు. ఆయిల్లే దావీదు రాజవంశం, సొలోమోను మొదలైన రాజులు. ప్రవక్త నాతాను యావేమాటగా దావీదుతో “యావే నీకొకయిల్ల కట్టిపెడతాడు” అంటాడు - 2, సమూ 7,11.

55. కాని యావే ప్రభువు నరుని యింటిని కట్టేవాడు, పడగొట్టేవాడు కూడ. కనుకనే అతడు యిర్మీయాతో "నిన్ను పడగొట్టడానికి పెరికివేయడానికి, కట్టడానికి