పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 279 P.pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యావే "నేనతనికి తండ్రినై యుంటాను, అతడు నాకు కుమారుడై యుంటాడు" అని చెప్తాడు-2 సమూ 7, 14. యావే ఈ రాజును ఎన్నుకోవడంద్వారా అతనికి తండ్రి ఔతాడు. రాజు యావేకు విధేయుడై యుండడంద్వారా అతనికి కుమారుడౌతాడు. ఆలాగే రాజునుగూర్చి నుడివే రెండవకీర్తనలోకూడ యావే "నీవు నా కుమారుడవు నేను నిన్ను కన్నాను" అంటాడు-77. ఈ విధంగా యిప్రాయేలు రాజులు యావేకు ప్రత్యేకవిధంగా పత్రులౌతారు. ఈ రాజుల కోవలో వచ్చినవాడే క్రీస్తు. అతడు మెస్సీయా, రాజు. కనుక రాజుల్లాగే అతడూ యావే పుత్రుడు.

44. క్రీస్తు వచ్చాక శిష్యబృందాన్ని కూర్చుకున్నాడు. ఈ బృందం ఓ సమాజం. ఈసమాజం దేవుణ్ణి "తండ్రీ" అని పిలుస్తుంది. క్రీస్తు రాకముందు యూదులు తమ జాతివాళ్లు మాత్రమే దేవుని బిడ్డలు అనుకున్నారు. పైన మన మదాహరించిన "తండ్రి తన ప్రియకుమారుని చక్కదిద్దినట్లే యావే తన కిష్టుడైన నరుని మందలిస్తాడు" అనే సామెతల పొత్తంలోని వాక్యానికి అన్వయంచెపూ యూదుల రబ్బయులు, యావే కిష్ణులైన నరులు యూదులు మాత్రమేనని వ్యాఖ్య చెప్పారు. కాని క్రీస్తు ఈ సంకుచిత మనస్తత్వాన్ని గర్షించి జనులందరు దేవుని బిడ్డలేనని నుడివాడు. "తూర్పు పడమర దేశాలనుండి వచ్చిన అన్యజాతివాళ్లు పరలోక రాజ్యంలో చేరతారు. రాజ్యపు వారసులైన యూదులు మాత్రం చీకటిలోనికి నెట్టబడతారు" అని బోధించాడు- మత్త 8, 12.

45. ఇక క్రీస్తు బోధించిన యీ పరలోకపు తండ్రి ఏలాంటివాడు? తన బిడ్డలను వాత్సల్యంతో ఆదరించేవాడు. ఆయన తన పుత్రుల అవసరాలను అడక్కుండానే తెలిసికుంటాడు- మత్త 6,32. వాళ్లకు సెబ్బర వస్తువులనుగాదు, మేలివస్తువులనే యిస్తాడు - 7,11. భూలోకంలోని మన తండ్రులు మనలనెంత ఆదరణతో చూచుకుంటారో ఆ పరలోకంలోని తండ్రి మనలను అంతకన్నా అధికమైన ఆదరంతో చూచుకుంటాడు. ఒకవేళ మనం పొరపాటున త్రోవతప్పి పోయినట్లయితే అతడు మనలను కఠినంగా శిక్షింపడు. తప్పిపోయిన కుర్రవానికొరకు తండ్రి యెదురు చూచినట్లుగా మనకోసం ఎదురు చూస్తాడు. జారిపోయిన గొర్రెలను కాపరి వెదుక్కుంటూ వెళ్లినట్లుగా మనలనువెదుక్కుంటూ వస్తాడు. పడిపోయిన నాణాన్ని గృహిణి గాలించి నట్లుగా మనలనుగూడ గాలిస్తాడు లూకా - 15. వేయేల, అతడు కరుణామయుడైన తండ్రి.

46. నరుడు ఈ తండ్రిని తన తండ్రినిగా అంగీకరించాలి. మత్త 23.9. తన అక్కరల్లో బిడ్డడు తండ్రి నడిగినట్లుగా నమ్మకంతో ఈతండ్రి నడుగుతూండాలి -7, 7-11. కూడుగుడ్డకోసంగూడ ఆ తండ్రిని నమ్మికతో అడగాలి. అతడు ఆకాశపక్షులను ఆహారంతో పోషించేవాడు. లిల్లీపుష్పాలను సోలోమోను వైభవంతో ధరించుకున్న