పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 279 P.pdf/250

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చేయగలిగిగూడ నిరాకరించలేదు? ఎన్నిసార్లు నేను ఆ లేవీయుడూ యాజకుడూ లాగ ప్రవర్తించలేదు? ఐనా అవసరంలో వున్నవాణ్ణి ఎవనినైనా సరే పట్టించుకోవలసిందేనని క్రీస్తు ఆజ్ఞ.

5. ఈ కథలోని పాత్రలు నల్లరికీ పేర్లు లేవు. కనుక వాళ్ళు ఎవరినైనా సూచించవచ్చు నన్నుగూడ సూచించవచ్చు. బాటసారికిలాగ నాకు ఇతరుల సాయం అవసరం కావచ్చు. సమరయునిలాగనేనితరులకు సాయం చేయవలసిన గడియ రావచ్చు నేను దీనికి సిద్ధంగా వుండాలి.

6. బాటసారి ప్రమాదాన్ని చూచి సమరయుడు తన ప్రయాణాన్నీ కార్యక్రమాన్ని మార్చుకొన్నాడు. జీవితంలో కొన్నిసార్లు ఇతరుల అవసరాలను బట్టి మన ప్రణాళికలూ పనులూ మార్చుకోవలసి వస్తుంది. అలాంటప్పడు మనం విసుగుకోగూడదు.

7. సమరయుడు తన ప్రేమను మాటల్లోగాక చేతల్లో చూపించాడు. తాను దిగి గాయపడినవాణ్ణి వాహన మెక్కించాడు. అతనిమీద డబ్బు ఖర్చుపెట్టాడు. అసలు మన మంచి సమరయుడు క్రీస్తే, అతడు నెత్తురోడ్చి ప్రాణాలర్పించి మన పాపాలకు పరిహారం చేసాడు. మన ప్రేమకూడ ఈలాగే క్రియాపూర్వకంగా వుండాలి.

8. సమరయునికి బాధితుని చూడగానే జాతి కలిగింది — 33. అతడు జాతి, కుల, మత భేదాలు పట్టించుకోకుండ సాయంజేసాడు. కాని మనదేశంలో ఈ భేదాలు చాలమంది పాటిస్తారు. ඩීසීඩී పట్టించుకోకుండ సాయంజేయడం శిష్యధర్మం.

27. తప్పిపోయిన గొర్రె, జారిపోయిన నాణెం - లూకా 5,4-10

1. తప్పిపోయిన గొర్రె, జారిపోయిన నాణెం దొరికినపుడు కాపరి, గృహిణి సంతోషించారు. ఆలాగే పాపులు పరివర్తనం చెందినపుడు దేవుడు సంతోషిస్తాడు.

2. కాపరి గొర్రెను వెదుక్కొంటూ పోయాడు. బైబులు మతంలో దేవుడు నరులను వెదుక్కొంటూ వస్తాడు. " అన్యమతాల్లో నరులు దేవుణ్ణి వెదకుతారు. ఇది పెద్ద భేదం. భగవంతుడు మొదట మనలను ప్రేమించందే మనం అతన్ని ప్రేమించలేం - 1 యోహా 4, 19.

3. గొర్రె తప్పిపోయింది. మనం చాలసార్లు దేవునినుండి తప్పిపోతాం. లోక వస్తువుల్లో చిక్కుకొంటాం. ఐనా అతడు మనలను వెదుక్కొంటూ వస్తాడు. మనం అతన్ని పోగొట్టుకొన్నా అతడు మనలను పోగొట్టుకోడు.

4. పోగొట్టుకొన్న వస్తువమీద మనకు మమకారం పెరుగుతుంది. దేవుడు ఒక్క పాపిని పోగొట్టుకొంటే అతన్ని అమిత విలువతో జూస్తాడు. ప్రేమతో అతని కొరకు గాలిస్తాడు. తల్లి జబ్బుపడిన బిడ్డట్టిలాగ అతన్ని పరామర్శిస్తాడు.