పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 279 P.pdf/249

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

2. సీమోను క్రీస్తుని ఆహ్వానించాడేగాని అతనికి తగిన మర్యాద చూపలేదు. ఇప్పడు మనం క్రీస్తుని అంగీకరిస్తాం. కాని అతన్ని పూర్ణహృదయంతో పూజించం. అతడు మననుండి త్యాగాలు కోరతాడేమోనని భయపడతాం.

3. ఈ కథలోని స్త్రీ క్రీస్తు దగ్గరికి వచ్చేటప్పటికే పాపపరిహారం పొందింది. కాని సీమోను ఆమెను ఇంకా పాపాత్మురాలినిగానే భావించి చిన్నచూపు చూచాడు. తరచుగా ఇతరులను గూర్చి చెడ్డగా భావిస్తాం, చెడ్డగా మాట్లాడుతాం. కాని ఇది తప్ప - మత్త 7,1.

4. ఈ స్త్రీ పూర్వం పాపాత్మురాలు. కాని ఇప్పడు ఆ పాపాలను వదలించుకొని క్రీస్తుపట్ల కృతజ్ఞత, భక్తి ప్రేమ చూపింది. ఆమె హృదయభారం తొలగిపోయింది. పాప పరిహారం వలన బరువు తొలగిపోతుంది. ఉత్సాహం, ఆనందం కలుగుతాయి.

5. పరిసయులు క్రీస్తుని "పాపులకు మిత్రుడు" అని నిందించారు -లూకా 7,34. ఇక్కడ ఇస్త్రీకి సీమోను శత్రువు. క్రీస్తు మిత్రుడు. పాపులమైన మనకు క్రీస్తు అనే మిత్రుడు ఉన్నాడనే భావం ఊరటను కలిగించాలి.

6. దేవుడు ఈ స్త్రీ చేసిన అధిక పాపాలు మన్నించగా, ఆమె అధికంగా కృతజ్ఞత చూపింది. ఆలాగే ప్రభువు మనం చేసిన పాపాలు మన్నించాడు. కాని మనం అతనిపట్ల అధిక కృతజ్ఞత చూపుతున్నామా?

7. సీమోను ఈ స్త్రీ పాపాలు గణించాడు. కాని ఆమె అతని పాపాలు గణించలేదు. ఇతరుల పాపాలను గమనిస్తే మన పరివర్తనం ఆగిపోతుంది. మనమొక్కరమే పాపులమా అనే భావం కలుగుతుంది. పాప పరిహారం ద్వారా దేవుని ప్రేమను చవిజూచినవాళ్ళు ఇతరుల తప్పలను గణించరు. తమ తప్పలకు తాము బాధపడతారు.

26. మంచి సమరయుడు = లూకా 10, 29-37.

1. సమరయుడు ఇతరాలోచనలేవి లేకుండ అక్కరలోవున్న వారిపట్ల పొరుగువాడుగా ప్రవర్తించాడు. ఆలాగ మనంకూడ జాతి, మత, కుల భేదాలు పాటించకుండ అవసరంలో వున్నవారికి సాయంజేయాలి.

2. క్రీస్తు వాక్యాలను బట్టి దేవుడ్డీ తోడినరుజ్జీ ప్రేమించేవాడు జీవిస్తాడు - 28, జీవితంలో ముఖ్యమైంది ప్రేమే. దేవుడు ఈ ప్రేమ శాసనాన్ని మన హృదయం మీదనే వ్రాసివుంచాడు. ప్రేమించేవాడు జీవవృక్ష ఫలాన్ని భక్షించినట్లే, 

3. కాని ఇతరులను ప్రేమించడం ఎంతమాత్రం సులభంకాదు. మన స్వార్థం అడుదగులుతుంది. కనుక ఆత్మ తన ప్రేమను మన హృదయాల్లో కుమ్మరించి మనచే ప్రేమకార్యాలు చేయిస్తుంది - రోమా 5,5.

4. ధర్మశాస్త్ర బోధకుడు నాకు పొరుగువాడెవడు అని ప్రశ్నించాడు. అనగా నేనెవరిని ప్రేమించాలి అని భావం. రోజువారి జీవితంలో మనకిష్టమైన వాళ్ళను పట్టించుకొని ఇష్టంగాని వాళ్ళను వదలివేస్తాం. ఎన్నిసార్లు ఇతరులడిగినా నేను సహాయం