పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 279 P.pdf/248

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గమనించలేదు. మన పథకాలను దేవుడు దీవించాలని వేడుకొందాం, లేకపోతే వాటిని పూర్తిచేయలేం.

6. అందరికీ భద్రత కావాలి. ఉద్యోగ భద్రత, ఆరోగ్య భద్రత, ప్రాణ భద్రత - ఈలా ప్రతి రంగంలోను భద్రత అవసరమే. కాని మృత్యువు మన భద్రతలన్నిటినీ నాశం జేస్తుంది. చావునుండి మనకు భద్రతనిచ్చేవాడు దేవుడొక్కడే. కనుక అతన్ని మన ప్రధాన భద్రతగా ఎంచాలి.

7. దేవునితో సంబంధం లేకుండా ఏ లోక వస్తువునీ వినియోగించకూడదు. అన్ని వస్తువులూ నాశమౌతాయి. అనశ్వరుడు భగవంతుడొక్కడే

8. ఈ ధనికుడు తలవని తలంపుగా చచ్చాడు. దేవుణ్ణి పట్టించుకోనివాడు ఎప్పడో, ఎక్కడో అనుకోకుండా కన్నుమూస్తాడు.

9. మనకు అనంతమైన సంపద క్రీస్తే - 2 కొ 8,9. మన అభద్రతలన్నీ తొలగించేది ఆ ప్రభువే. కనుక వివేకి అతనిపై ఆధారపడాలి.

24. నడిరేయి వచ్చిన స్నేహితుడు — లూకా 11,5 -13

1. అర్ధరాత్రిలో అతిథి వచ్చినపుడు మిత్రుని దగ్గరికి వెళ్ళి రొట్టెలు బదులీయమని అడిగితే అతడు తప్పక ఇస్తాడని నమ్ముతాం. ఆలాగే మనం పరలోకంలోని తండ్రిని మనవలడిగితే అతడు తప్పకుండ ఇస్తాడని నమ్మాలి.

2. ఈ కథ మనవి ప్రార్థనను గూర్చి దేవుణ్ణి నమ్మకంతో అడగాలి. వెంటనే ఈయకపోయినా మనం అడిగినట్లే ఈయకపోయినా, అతడు ఈయడం మాత్రం ఖాయం.

3. దేవుడు మనం అడిగినదానికంటే ఎక్కువగానే ఈయాలని కోరుకొంటాడు. మనం తెలియక తక్కువగా అడుగుతాం - ఎఫే 3,20,

4. కొందరు స్తుతిప్రార్ధనం గొప్పదనీ, మనవి ప్రార్ధనం అల్పమైందనీ భావిస్తారు. కాని మనవి ప్రార్ధనం కూడమనవకవసరం. పరలోక జపంలోని చివరి నాలు విన్నపాలు మనవులేకదా!

5. ఈ కథలోని గృహస్టు నిజమైన అక్కరతో స్నేహితుని దగ్గరికి వెళ్ళాడు. తన అక్కర తీర్చమని నిండు హృదయంతో అడిగాడు. మనం దేవుణ్ణి కూడ పూర్ణ హృదయంతో అడగాలి. పట్టీపట్టనట్లుగా ప్రార్థన చేయకూడదు.

25. ఇద్దరు బాకీదారులు – లూకా 7,36

1. ఎక్కువ అప్ప మన్నింపబడినవాడు యజమానునిపట్ల ఎక్కువ కృతజ్ఞత చూపుతాడు. ఆలాగే ఎక్కువ పాపాలు మన్నింపబడిన వ్యక్తి దేవునిపట్ల ఎక్కువ కృతజ్ఞత చూపుతాడు.