పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 279 P.pdf/251

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

5. 99 మంది నీతిమంతుల కంటె ఒక్క పాపి పరివర్తనం చెందినపుడు దేవునికి ఎక్కువ సంతోషం కలుగుతుంది. దేవుడు పుణ్యాత్ములను పట్టించుకోడని కాదు. పాపులపట్ల అధికప్రీతి చూపుతాడని భావం. వైద్యుడు ఆస్పత్రిలోని తీవ్రరోగిపట్ల ఎక్కువ శ్రద్ధ చూపడా?

6. మంచి కాపరి తప్పిపోయిన గొర్రెను తిరిగి మందలోనికి చేర్చుతాడు. మనంకూడ పాపలను దేవుని దగ్గరికి రాబట్టాలి. అపమార్గం పట్టినవారికొరకు ప్రార్థించడం, వారితో స్నేహంగా, మృదువుగా మెలగడం ఇందుకు కొన్ని మార్గాలు.

28. తప్పిపోయిన కుమారుడు - లూకా 15, 11-82

1. ప్రేమగలతండ్రి చిన్న కుమారుడు ఆస్తిని దుర్వ్యయం చేసి తిరిగి వచ్చినా అతన్ని ఆనందంతో ఆహ్వానించాడు. పెద్దకొడుకుని కూడ తనతోపాటు ఆనందించమన్నాడు. ఆలాగే దేవుడుకూడ పశ్చాత్తాపపడే పాపులను క్రీస్తుద్వారా ఆనందంతో ఆహ్వానిస్తాడు. ఇతరులను గూడ తనతోపాటు ఆనందించమంటాడు.

2. ఈ కథలోని తండ్రి దేవుణ్ణి సూచిస్తాడు. అతడు పశ్చాత్తాపపడే పాపులను కరుణతో, ప్రేమతో అంగీకరిస్తాడు. క్రీస్తుకూడ ఈ తండ్రిలాగే చేస్తాడు. అతడు పాపులకు మిత్రుడు - లూకా 7, 34.

3. చిన్నవాడు తిరిగి వచ్చి తండ్రీ! నీకు ద్రోహంగా పాపంజేసాను అన్నాడు. నిజాయితీతో మన పాపాన్ని ఒప్పకొంటే దేవుడు మనలను క్షమిస్తాడు. రోగి రోగం తెలియజేస్తే వైద్యుడు నయంజేస్తాడు కదా!

4. ఈ కథలోని తండ్రి కుమారుని స్వేచ్ఛకు అడ్డురాలేదు. ఆస్తిని పంచుకోవడం, దూరదేశానికి వెళ్లడం అక్కడ దాన్ని ఖర్చుచేయడం అన్నీ కుమారుని స్వేచ్ఛ ప్రకారం జరిగాయి. దేవుడు ఇప్పడు మన స్వేచ్ఛకు అడ్డురాడు. మనం పాపం చేయాలనుకొంటే చేయనిస్తాడు.

5. చిన్నవాడు తండ్రిని విడనాడి దూరదేశాలకు వెళ్ళిపోయాడు. పాపమంటే దేవునికి దూరంగా వెళ్ళిపోవడం. ప్రేమగల తండ్రిని విడనాడి లోక వస్తువుల్లోకి వెళ్ళి పోవడం.

6. చిన్నవాడు నా స్వేచ్ఛను నా యిష్టమొచ్చినట్లుగా వినియోగించుకొంటాను అనుకొన్నాడు. చివరకు పరాయి యజమానునికి బానిస అయ్యాడు. మన స్వేచ్చను మన యిష్టమొచ్చినట్లుగా ఉపయోగించుకొంటే చాలసార్లు దాన్ని చెడగొడతాం. కాని దాన్ని దేవునికి అప్పగిస్తే బానిసలంగాము, స్వతంత్రులమౌతాం - రోమా 8,11.

7. చిన్నవాడు తండ్రిపట్లగల ప్రేమచే తిరిగి రాలేదు. ఆకలికి తట్టుకోలేక తిరిగివచ్చాడు. అతనిదంతా స్వార్థం. ఐనా తండ్రి అతన్ని అంగీకరించాడు. అతని ప్రేమ అంత గొప్పది, తరచుగా మనం నరకానికి పోతామేమోనని భయపడి మన పాపాలకు