పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 279 P.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తగుల బెడతారు - 15,6. ఇది దుష్ఫలితం. క్రీస్తులోనికి ఐక్యమై చక్కగా పండ్ల పండేవాళ్ళ తండ్రిని మహిమ పరుస్తారు - 15,8. దీనిద్వారా క్రీస్తు, ఆ క్రీసూలోనికి ఐక్యమై అతని శిష్యులైన జనులూ సంతోషిస్తారు. బైబులు రచయితలంతా ద్రాక్షతీగను దేవుని ప్రజకు ఉపమానంగా వాడారు. దేవుడా ప్రజను ఆదరంతో చూస్తాడని చెప్పారు. యోహానుమాత్రం ఈ యుపమానాన్ని క్రీస్తుకూ అతని శిష్యులకూ వుండే ఐక్యతాభావాన్ని సూచించడానికి వాడాడు. ఇది అతని ప్రత్యేకత.

37ఇక, యీ ద్రాక్షతీగ అనే ఉపమానం చాల ప్రార్థనా భావాలకు ఉపకరిస్తుంది. ద్రాక్ష పండును చిదిమి రసం తీస్తారు. కనుక బైబుల్లో ఈ పండు బాధలనుభవించడాన్ని నెత్తురు చిందడాన్ని సూచిస్తుంది. యెషయా ప్రవచనంలో యావే తన శత్రువులను గూర్చి మాటలాడుతూ " వాళ్ళను ద్రాక్షపండ్లను తొట్టిలోపెట్టి త్రోక్కినట్లుగా తొక్మాను” అంటాడు63,3. ఇక్కడ త్రోక్కిన ద్రాక్షపండ్ల రసాన్నికార్చినట్లుగా శత్రువులు కూడ నెత్తురు కారుస్తారని భావం. పైగా ద్రాక్షపండు నెత్తురే దాని రసం. ఇదే భావాన్ని నూత్నవేదం క్రీస్తుకు గూడ అన్వయిస్తుంది. “ఈ పాత్రం మీ కొరకు చిందబడే నారక్తంతో ముద్రితమైన నూతన నిబంధనం" అంటాడు ప్రభువు – లూకా 22,20. ఇక్కడ ద్రాక్షపండు నలిగి రసాన్ని చిందించినట్లుగానే క్రీస్తు దెబ్బలవలన నలిగి నెత్తురు చిందిస్తాడనే భావం ధ్వనిస్తుంది. మనము ఈ పాత్రను పుచ్చుకొనేపడెల్లా ప్రభు బాధలను జ్ఞాపకం జేసికుంటూంటాం. పౌలు ప్రభు వాక్యాలను ఉదాహరిస్తు ఈలా వ్రాసాడు. "ఈ పాత్ర నా రక్తంతో ముద్రితమైన క్రొత్త నిబంధనం. నన్ను జ్ఞాపకం చేసికొనటానికి దీనిని పుచ్చుకొనండి. మీరు ఈ రొట్టెను భుజించి, ఈ పాత్రను పుచ్చుకునేపుడెల్లా ప్రభువు మరల విజయం చేసిందాక ఆయన మరణాన్ని ప్రకటిస్తూంటారు” - 1 కొ 11, 25-26. కనుక మనం ద్రాక్షసారాయపు రూపంలో వున్న ఈ పాత్రద్వారా క్రీస్తు మరణాన్నిస్మరించుకుంటూండాలి. దివ్యపూజద్వారా రోజురోజు ఈ స్మరణాన్ని కొనసాగించుకుంటూండాలి.

3. ద్రాక్షసారాయం బలులకు, నిబంధనకు సూచకంగా గూడ వుంటుంది. బైబులు ప్రజలు బలుల్లో ద్రాక్షసారాయాన్ని వాడేవాళ్లు, బల్యర్పణంలో ఈ సారాయాన్ని బలిపశువు నెత్తుటికి బదులుగానైన వాడేవారు. లేక ఆ నెత్తుటిలో కలిపైనా వాడేవారు. ద్వితీయోపదేశకాండం 32, 38 ఈ యాచారాన్ని పేర్కొంటుంది. క్రీస్తుకూడా క్రొత్త నిబంధన కోసమైన తన సిలువబలిలో సొంత నెత్తురు చిందించాడుగదా! తాను చిందించే ఈ నెత్తుటికి బదులుగానే అతడు కడపటివిందులో ద్రాక్షసారాయాన్ని వాడాడు. అందుకే అతడు పాత్రనందుకొని "ఈ పాత్రం మీ కొరకు చిందబడే నా రక్తంతో ముద్రితమైన నూతన నిబంధనం" అంటాడు - లూకా 22,20. ఇక్కడ పాత్రలోని ద్రాక్ష సారాయం