పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 279 P.pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

34. పై రెండంశాల్లోను మనం చూచిన భావాలు మొదటి మూడు సువార్తలకు చెందినవి. యూద సమాజమూ క్రైస్తవ సమాజమూ దేవుడు జాగ్రత్తగా పెంచుకునే తోటలాంటివాళ్లని ఈసువార్తల భావం. కాని నాల్గవ సువార్తకారుడైన యోహాను ఓ క్రొత్తభావాన్ని ప్రవేశపెట్టాడు. కనుక అతనిభావాన్ని ప్రత్యేకంగా విచారించి చూడాలి. నాల్గవ సువార్త 15, 1–10 ద్రాక్ష తోటను వర్ణిస్తుంది. ద్రాక్షతీగ ఉపమానంగా తీసికొని యోహాను క్రీస్తునకు క్రైస్తవులకు వుండే ఐక్యభావాన్ని విశదం చేసాడు.

మొదట, క్రీస్తు "నిజమైన ద్రాక్షతీగ". యూదులు చెడ్డతోట లాంటివాళ్ళు, పాడుతీగల్లాంటివాళ్ళు తండ్రి ఆశించిన నిజమైనతోట, మంచితోట, క్రీస్తు, ఈ తోటకు తండ్రే కాపు. క్రీస్తు అనే తీగలోని పనికిరాని రెమ్మలను తండ్రి కత్తిరిస్తాడు. ఆ మొక్కను చక్కపరుస్తాడు, అప్పడు ఆ తీగ చక్కగా ఫలిస్తుంది - 15, 1-8. ఇక్కడ క్రీస్తు అనే ద్రాక్షతీగ, లేక తోట, తండ్రి ఆశించినట్లే మంచి ఫలాలిచ్చిందని భావం. పూర్వవేదప్రజలనే తోట యావే కోరినట్లుగా మంచి పండ్లియలేదని విన్నాంకదా! క్రీస్తు నిజమైన యిస్రాయేలు. తండ్రి స్వయంగా నాటినతోట. యావే సేద్యగాడై స్వయంగా పెంచిన ద్రాక్షతీగ. అతడు ఆ తండ్రి కోరినట్లే సత్ఫలితాన్నిస్తాడు.

35. ఇక, క్రీస్తు ద్రాక్షతీగైతే మనం ఆతీగలోనికి అతుక్కొని పోయిన కొమ్మలం ఎవడు ఆ క్రీస్తులోనికి అతుక్మొనిపోతాడో వాడు చక్కగా ఫలిస్తాడు. తల్లి తీగలోని సారం కొమ్మల్లోనికి వస్తుంది. ఆకులు పూలు కాయలుగా మారిపోతుంది. ఆలాగే క్రైస్తవునిలోనికి గూడ క్రీస్తు సారంవస్తుంది. అదేవరప్రసాదం. దానిద్వారా నరుడు జంతు ప్రవృత్తిని విడనాడి దివ్యజీవితం జీవిస్తాడు. ఈలా క్రీసులోనికి అతుక్కొనిపోవడం లేక ఐక్యంగావడమనేది రెండు క్రియల ద్వారా సిద్ధిస్తుంది. మొదటిది, నరుడు క్రీస్తుని విశ్వసించాలి. రెండవది, అతనిలోనికి జ్ఞానస్నానం పొందాలి. ఈ విశ్వాస జ్ఞానస్నానాల ద్వారా మనం క్రీస్తుతో సంబంధం కలిగించుకుంటాం. అతనితో ఐక్యమౌతాం. ఈ మైక్యభావాన్ని వివరించడానికే పౌలు దేహం, అవయవాలు అనే ఉపమానం వాడాడు. యోహాను తీగ - కొమ్మలు అనే ఉపమానం చెప్పాడు. పేత్రు మూలరాయి - దానిమీద కట్టబడే భవనం అనే ఉపమానం ఇచ్చాడు. వీటన్నిటిల్లోను భావం ఒకటే - క్రీస్తుతో ఐక్యంగావడం.

36. క్రీస్తు ద్రాక్షతీగ, మనం ఆ తీగలోనికి అతుక్కొని పోయిన కొమ్మలం అన్నాం. కనుక యిక్కడ ఫలితం రెండు రూపాలుగా వుంటుంది. ఎవడు క్రీస్తులోనికి ఐక్యమౌతాడో వాడు చక్కగా పండ్ల పండుతాడు - 15,5. ఇది సత్ఫలితం. క్రీస్తు అనే తీగతో ఐక్యంగాని కొమ్మకాయలుకాయదు - 15,3. కనుక ఆలాంటి రెమ్మను నరకి పారవేస్తారు. నిప్పులో