పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 279 P.pdf/239

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

బహుమానమూ దయచేస్తాడు అనుకొంటాం. కాని అతడు కరుణ గలవాడు కూడ. అతడు మన తప్పిదాలను మన్నించి మనలను గూడ దైవరాజ్యంలో చేర్చుకొంటాడు. చివరి జట్టవాళ్ళకు కూడ పూర్తి వేతనం చెల్లిస్తాడు.

3. ఈ కథలో మొదటి జట్టు కూలీలు ద్రాక్షతోటలో 12 గంటలు పనిజేసినందుకు బాధపడ్డారు. మనం కూడ మేము దేవుని సేవలో అంతపని చేయాలి కదా, ఇంతపని చేయాలికదా అని సుమ్మర్లు పడతాం. కాని దేవునికి సేవ చేయడం మహాభాగ్యం. "దొరకు నా యిటువంటి సేవ" అన్నాడు భక్తుడు త్యాగరాజు. దేవుణ్ణి గాఢంగా ప్రేమిస్తే మన శ్రమలోని కష్టాన్ని మరచిపోతాం, అగస్టీను భక్తుడు చెప్పినట్లు "ప్రేమ వున్నచోట శ్రమ అన్పించదు. ఒకవేళ శ్రమ అన్పిస్తే, ఆ శ్రమను గూడ ఇష్టపడతాం."

4. కూలీలు ద్రాక్షతోటలో పనిజేసారు. ఈ పని దేవుని సేవే. మనం ఈ లోకంలో శ్రమ జేసాక కడన మోక్షం లభిస్తుంది అనుకొంటాం. కాని ఇది సరికాదు. మోక్ష జీవితం ఈ లోకంలోనే ప్రారంభమై పరలోకంలో పరిపూర్ణమౌతుంది. ఏకైక దేవుణ్ణి తెలిసికొని ప్రేమించడమే నిత్యజీవం - యోహా 17,3. ఈ లోకంలో విశ్వాసంతో మాత్రమే దర్శించే దేవుణ్ణి పరలోకంలో ప్రత్యక్షంగా దర్శిస్తాం. అంతే తేడా.

5. యజమానుని కరుణ వల్ల చివరి జట్టవాళ్ళకు కూడ కుటుంబ ఖర్చులకు సరిపోయే ఒక దీనారం లభించింది. దేవుడు న్యాయవంతుడు మాత్రమే కాదు. దయాపరుడు కూడ. పాపులందరికీ, మనకు కూడ అతని దయే దిక్కు

6. మొదటి ಜಟ್ಟವ್ಳ್ಳಿ చివరి జట్టవాళ్ళను చూచి అసూయ చెందారు. అసూయ ఈ లోకంలోనే గాని మోక్షంలో వుండదు. ఇక్కడ పాపులుగా జీవించి పరివర్తనం జెంది మోక్షానికి పోయినవాళ్ళు అక్కడ పుణ్యాత్ములుగా జీవించి వచ్చినవాళ్ళను జూచి అసూయపడరు. ఇక్కడ పుణ్యాత్ములుగా జీవించి మోక్షానికి పోయినవాళ్ళ అక్కడ పాపులుగా జీవించి వచ్చిన వాళ్ళను జూచి అసూయపడరు. అందరూ దేవుని ప్రసాదమే మనల నందరినీ రక్షించిందనుకొని ఆనందిస్తారు.

12. భూస్వామి, కొలుదారు 21,33–43

1. యజమానుడు ద్రాక్షతోటను తనకు ఫలాలనీయని కౌలుదార్ల నుండి తొలగించి తగిన ఫలాల నిచ్చే కౌలుదార్లకిచ్చాడు. అలాగే దేవుడు దైవరాజ్యాన్ని తనకు ఫలితాన్నీయని యిస్రాయేలు నుండి తొలగించి మంచి ఫలితాన్నిచ్చే ఇంకో ప్రజలకు అప్పగిస్తాడు. ఆప్రజ క్రైస్తవులే.

2. మంచి ఫలితాన్ని ఈయనందున దైవ రాజ్యం యిస్రాయేలు నుండి తొలగించబడింది. మనం నూత్నయిస్రాయేలుమి. మనం దేవునికి మంచి ఫలితాన్నీయాలి. ఈ ఫలితం మన భక్తిప్రపత్తులు, పుణ్యక్రియలు మొదలైనవి.