పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 279 P.pdf/238

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

2. పగదీర్చుకోవాలనే కోరిక నరుల్లో విపరీతంగా వుంటుంది, అగ్నిశేషం, ఋణశేషం, శత్రుశేషం మిగల్చరాదు అనేది ఈ దేశంలో రాజనీతి, కాని మనం ఈ కోర్మెను అణచుకోవాలి. ఈ కథలోని రాజు దేవుణ్ణి సూచిస్తాడు. అతడు మన అపరాధాలను మన్నిస్తాడు. మనం కూడ తోడివారి తప్పలను మన్నించాలని కోరుకొంటాడు.

3. పూర్వవేదంలో యావే యిప్రాయేలు అపరాధాలు మన్నించాడు. నూతవేదంలో క్రీస్తు నరులందరి తప్పలు క్షమించాడు. తండ్రి క్రీస్తు ద్వారా లోకాన్ని తనతో సమాధాన పరచుకొన్నాడు -2 కొరి 5,19. ఈ తండ్రీ కుమారుల్లాగే మనంకూడ తోడివారి నేరాలు క్షమించాలి.

4. ఈ కథలోని సేవకుడు రాజుకి పది కోట్ల దీనారాలు అప్ప పడ్డాడు. ఇది చాల పెద్ద మొత్తం. మన పాపాల ద్వారా మనం కూడ దేవునికి పెద్ద అపరాధమే చేస్తాం. ప్రభువు మంచితనాన్నీదయనూ లెక్కలోకి తీసికొంటే మన అపరాధం ఇంకా పెద్దదౌతుంది. తరచుగా మనం పాపాన్ని తక్కువగా అంచనా వేస్తాం. ఇది పెద్ద పొరపాటు.

5. ఈ సామెత ప్రకారం మనం దేవునికి పదికోట్ల దీనారాలు అప్ప పడ్డాం. తోడివాడు మనకు వంద దీనారాలే అప్ప పడ్డాడు. ఐనా మనం అతన్ని మన్నించం. ఇతరుని క్షమించ బుద్ధి పట్టదు. మనలోని రాతి గుండెను తొలగించమని దేవునికి ప్రార్ధన చేసికోవాలి - యెహె 36,26. ప్రార్ధనం మన హృదయాలను మారుస్తుంది. ఇంకా, సిలువ మిద వేలాడుతూ శత్రువులను క్షమించిన క్రీస్తుని కూడ ఆదర్శంగా తీసికోవాలి - లూకా 23,34.

6. ఈ కథలోని 85వ వాక్యాన్ని బట్టి శత్రువుని క్షమించనివాడు దైవ రాజ్యంలో చేరడు. దేవుడు అతన్ని శాశ్వత హింసకు - అనగా నరకానికి గురి చేస్తాడు. శత్రు క్షమాపణం క్రీస్తు ప్రధాన బోధల్లో వొకటి.

11. ద్రాక్షతోట కూలీలు 20, 1-16

1. ఈ కథ చెప్పినపుడు క్రీస్తు ఉద్దేశించిన భావం ఇది. ద్రాక్షతోట యజమానుడు చివరి జట్టు కూలీలకు గూడ పూర్తి వేతనం చెల్లించి తన ఔదార్యాన్ని నిరూపించుకొన్నాడు. అలాగే దేవుడు క్రీస్తు బోధల ద్వారా పరివర్తనం చెంది చివరన దైవరాజ్యంలో చేరిన సుంకరులకూ పాపులకూ పూర్తి బహుమానాన్ని దయచేస్తాడు. ,

ఇక, మత్తయి ఈ సామెతను లిఖించినపుడు ఓ నూత్న భావాన్ని చేర్చాడు. చివరన దైవరాజ్యంలో చేరిన క్రైస్తవులకు కూడ దేవుడు యిస్రాయేలీయులతో పాటు పూర్తి బహుమానాన్ని యిస్తాడు-16.

2. ఈ సామెతలోని యజమానుడు దేవునికి ప్రతిబింబం. మనం మామూలుగా దేవుడు న్యాయం తప్పని న్యాయాధిపతి, పాపులకు నరక శిక్షా, పుణ్యాత్ములకు మోక్ష