పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 279 P.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రభువును మిక్కుటంగా ప్రేమిస్తుంది. యిప్రాయేలీయులు తొలిదశలాంటిదే మన తొలి దశకూడ.

24. రెండవ దశలో యిప్రాయేలు సమాజం అనే వధువు పాపంచేసి ప్రభువు నిగ్రహానికి గురైందన్నాం, ఆలాగే క్రైస్తవ సమాజమనే వధువుకూడ పాపం కట్టుకొని ప్రభువు కోపానికి గురౌతుంది. ఐనా ప్రభువామెను కరుణిస్తాడు. ఆ వధువును ప్రేమించి ఆమెకోసం తన్నుతాను సిలువపై సమర్పించుకుంటాడు. ఆమెకు తన రక్షణవార్తను బోధిస్తాడు. ఆ వార్తె ఆమెకు స్నానం. దానివలన ఆమె పరిశుభ్రయై విశుద్ధురాలు ఔతుంది. పరిశుభ్రంగా, నిర్దోషంగా, కళంక రహితంగా తయారై సౌమ్యరూపాన్ని పొందుతుంది. ఈలాంటి వధువుని ప్రభువు మహిమతో తనయెదుట నిలుపుకుంటాడు. పెండ్లిలో పెండ్లి కొమారుడు తనయెదుట నిలువబడిన వధువునుజూచి సంతసించినట్లుగా సంతసిస్తాడు - ఎఫె 527, ఈ వధువు క్రైస్తవ సమాజం, ఈ వరుడు క్రీస్తు ఈలా క్రీస్తు తన వధువు పాపాలను క్షమించి ఆమెను మరల ఆదరిస్తాడు, ఇది రెండవ దశ.

25. మూడవ దశలో యిప్రాయేలు సమాజమనే వధువు ప్రభువు మన్ననకు పాత్రురాలు ఔతుందన్నాం, ఈ మూడవ దశ భావి కాలం. మెస్సీయాకాలం. చివరి రోజుల్లో క్రీస్తు వొచ్చాక సిద్ధించే దశ. ఈ దశలోకూడ క్రైస్తవ సమాజం ఓవధువులా చూపబడుతుంది. దర్శన గ్రంథకర్త ఆమెను ఇలా వర్ణించాడు. "క్రొత్త యెరూషలేమగు పరిశుద్ధ పట్టణం చక్కగా అలంకరించుకొని భర్త చెంతకువచ్చే పెండ్లి కొమార్తెలాగ పరలోకములోని దేవుని చెంతనుండి దిగి వచ్చింది" - 21,2. ఈలా దిగి వచ్చిన వధువును జూపుతూ దేవదూత “ఈలారా! గొర్రెపిల్ల భార్యయైన పెండ్లికొమార్తెను నీకు చూపెడతాను" అంటాడు - 21,9. ఈ వధువు మోక్షవాసులూ, భూలోక విశ్వాసులూను. అనగా పూర్తి క్రైస్తవ సమాజం. ఈ సమాజమంతా ప్రభువు ప్రజ ఔతుంది. ఓ వధువులాగ అతనికి సమర్పిత మౌతుంది. మరణించి మళ్లా ఉత్తానమైన గొర్రెపిల్ల భార్య ఔతుంది. ఈ మూడవ దశను క్రీస్తు ఉత్థానంనుండి లోకాంతం వరకు వచ్చే కాలానికంతటికీ వర్తించుకోవాలి. దీన్నే బైబులు "తుదికాలం" అని పిలుస్తుంది.

26. బైబులు మనుష్య భాషలో మాటలాడుతుంది. మనుష్యులకు స్త్రీ పురుష సంబంధమైన దాంపత్య ప్రేమ చాలయిష్టమైంది. కనుకనే బైబులు దేవునికీ మానవునికీ వుండే సంబంధాన్ని దాంపత్య ప్రేమతో పోల్చిచెప్పింది. యూద సమాజం క్రైస్తవ సమాజం ప్రభువుకి ప్రియపడే వధువు. ఈ ప్రజలు వ్యక్తిగతంగాను, సామాజికంగాను దేవునికి వధుమోతారు.