పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 279 P.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సంగ్రహంగా జెప్పాలంటే యిప్రాయేలు ప్రజ ప్రభువును గాఢంగా ప్రేమించినన్నాళ్లు కన్యవధువు. అది తొలిదశ, అన్యదైవాలను ఆరాధించడం మొదలెట్టాక, వ్యభిచారిణి. అది రెండవదశ. ప్రభువు క్షమించాక, మళ్ళా యోగ్యురాలైన వధువు. అది మూడవ దశ.

22. పై మూడు దశలే నూత్నవేద ప్రజలకు కూడ వర్తిస్తాయి. పూర్వ వేద ప్రజలకు యావే యేలాగో నూత్నవేద ప్రజలకు క్రీస్తు ఆలాగు. ఆ ప్రభువు వచ్చాక యిస్రాయేలు ప్రజలకు మారుగా క్రైస్తవ సమాజం ఏర్పడుతుంది. యిస్రాయేలు యావే వధువైనట్లే క్రైస్తవ సమాజం (తిరుసభ) క్రీస్తు వధువెతుంది.

నూత్న వేదప సామెతలు ఈ భావాన్నే సూచిస్తాయి. స్నాపక యోహాను శిష్యులు యేసును సమీపించి "మీ శిష్యులు ఉపవాస మండరేల? అని ప్రశ్నించారు. ప్రభువు "పెండ్లికొమారుడున్నంతకాలం పెండ్లి విందునకు వచ్చిన అతిథులు చింతింపరుగదా? పెండ్లికొమారుడు ఎడబాసి పోయే కాలం వచ్చినప్పడు వాళ్లు చింతతో ఉపవాసముంటారు" అన్నాడు - మత్త 9,15. ఇక్కడ క్రీస్తు వరుడు, నూత్న వేదప్రజలు అతని వధువు అని భావం. స్నాపక యోహాను క్రీస్తునుద్దేశించి "పెండ్లి కొమార్తె పెండ్లికొమారుని సొత్తు" అంటాడు - యోహా 3,29. ఇక్కడ గూడ క్రీస్తు వరుడనే భావం. మత్తయి 22, 1-14 లో ఓరాజు తన కుమారునికి పెండ్లి చేస్తూ అతిథులనాహ్వానిస్తాడు. ఇక్కడ కూడపెండ్లి కొమారుడు క్రీస్తే నూత్నవేద సమాజమే అతని వధువు. మత్తయి 25, 1-15లో పదిమంది కన్యలు ప్రభువు కొరకు వేచివున్నట్లు చెప్పబడింది. ఇక్కడ క్రైస్తవ సమాజం ఓ మంచి వధువులాగ వరుడైన క్రీస్తు రెండవ రాకడకోసం ఎదురుచూస్తుండాలని భావం. కనుక ఈ సామెతలన్ని క్రీస్తుని వరునిగాను క్రీస్తుసమాజాన్ని వధువునుగాను చిత్రిస్తాయి. దేవునికీ ప్రజలకీ మధ్య దాంపత్య సంబంధ ముంటుందనే భావం పూర్వ వేదంనుండి నూత్న వేదంలోనికి జాలువారింది.

23. పూర్వవేద ప్రజలు సీనాయి ఒడంబడిక ద్వారా యావే ప్రభువు ప్రజలూ, అతని వధువూ అయ్యారన్నాం. యూదులకు సీనాయి ఒడంబడిక ఎలాంటిదో క్రైస్తవులమైన మనకు జ్ఞానస్నానం ఆలాంటిది. ఈ జ్ఞానస్నానం ద్వారా మనము క్రీస్తు ప్రజలము, క్రీస్తు వధువులమౌతాం. కనుకనే పౌలు కొరింతు క్రైస్తవసమాజానికి వ్రాసిన రెండవ జాబులో "విశుద్ధురాలైన కన్యనులాగ మిమ్మ ఒకేపరుషుడైన క్రీస్తునకు ప్రధానంచేసాను" అంటాడు - 11,2. పౌలు కొరింతులోని స్త్రీ పురుషులకు జ్ఞానస్నానమిచ్చాడు. అక్కడ ఓ సమాజం ఏర్పరచాడు. ఈ సమాజమే క్రీస్తుకు ప్రధానం చేయబడిన వధువు. జ్ఞాస్నానమే ఈ ప్రధానం. తొలిదశలో, అనగా యెడారి కాలంలో, యిస్రాయేలు కన్యవధువై ప్రభువును గాఢంగా ప్రేమించిందన్నాం. జ్ఞానస్నానకాలంలో క్రైస్తవ సమాజంకూడ కన్యవధువై