పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 279 P.pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మనకు వరునిలాంటివాడు భగవంతుడు. ఇక, యీ భగవంతుణ్ణి వర్ణిస్తూ ద్వితీయోపదేశకాండం "యావే దహించే అగ్నిలాంటివాడు. అతడు అసూయాపరుడైన దేవుడు" అంటుంది - 4,24. ఈ లక్షణాలే క్రీస్తుకూ వర్తిస్తాయి. భగవంతుడు దహించే అగ్నిలాంటివాడు. అగ్ని చెట్టుచేమలను కాల్చి నుసి చేస్తుంది. అలాగే భగవంతుడు తన్నెదిరించినవారిని భస్మం చేస్తాడు. అతడు అసూయాపరుడైన దేవుడు. అనగా అన్యదైవతాలను ఆరాధిస్తే సహించేవాడు కాడు. ఇక యీ రెండవ అధ్యాయంలో భక్తుడు ప్రియురాలితో పోల్చబడ్డాడని చెప్పాం. వరుడు వధువు హృదయంలోని అన్య ప్రేమలను సహింపడుగదా! భగవంతుడు గూడ మన హృదయంలో అన్య ప్రేమలుంటే సహింపడు. అతనిపై కాకుండ దేనిమీద దృష్టి పెట్టుకున్నా అది అన్యప్రేమే. ఆ ప్రభువునకు తన పట్ల గాఢభక్తిలేనివారియెడల సంతసం కలుగదు. కనుక క్రైస్తవ ప్రజలమైన మనం విశుద్ధురాలైన వధువులాగ, అనన్యభక్తితో, ఏకాగ్రదృష్టితో, ఆప్రభువును సేవిద్దాం. ప్రేమిద్దాం. అతని కిష్టపడే ప్రియవధువులా ప్రవర్తిద్దాం.

3. తోటమాలి — తోట

27. పూర్వవేదం భగవంతుణ్ణి తోటమాలితో ఉపమిస్తుంది. యూదులను ద్రాక్షతోటతో పోలుస్తుంది. గోదుమ, ఓలివు తోటలు, ద్రాక్షతోటలు ఇవిమూడు పాలస్తీనా దేశంలో పండే సామాన్యపంటలు. బైబులు దేశాల్లో ద్రాక్షతోటలను విరివిగా పెంచేవాళ్ళ సుమేరియా, బాబిలోనియా, మొదలైన పాలస్తీనా సమీప దేశాల్లో ద్రాక్షసారాయాన్ని ప్రాణంగా భావించేవాళ్ళు ఈ సారాయాన్ని సమాధుల్లో క్రుమ్మరించేవాళ్ళ అది చనిపోయిన వాళ్ళకు అమరత్వాన్నిస్తుందని అభిప్రాయపడేవాళ్ళు. యూదుల భావాల ప్రకారం ద్రాక్షసారాయం ద్రాక్షపండ్ల నెత్తురు! నెత్తురులో ప్రాణముంటుంది. కనుక ద్రాక్షసారాయం జీవాన్నిస్తుంది అన్నారు. కొందరు రబ్బయిలు ఏదెనులోని మంచి సెబ్బరలు తెలియజేసే చెట్టుకూడ ద్రాక్షచెట్టేనని బోధించారు. నూత్నవేదంలో ద్రాక్షసారాయం మెస్సీయా వచ్చిన రోజులను సూచిస్తుంది — మత్త 9, 17.

28. మొదట ద్రాక్షతోటను నాటినవాడు నోవా - ఆది 9,20. ఈ ద్రాక్షతోట ద్వారా, జల ప్రళయానికి తప్పి బ్రదికిన జనులను దేవుడు సంతోషచిత్తులను జేసాడు. మెస్సీయా రోజులు వచ్చినపుడు జనులు వారివారి తోటల్లో అత్తిచెట్ల క్రింద, ద్రాక్షతీగల క్రింద విశ్రాంతి తీసుకుంటారని చెప్పబడింది -1 రాజు, 4, 24. అనగా ద్రాక్షతోట విశ్రాంతి చిహ్నం. ఇక వరునికి యింట్లో భార్య యెలాగో, పొలములో ద్రాక్షతోట ఆలాగు - కీర్త 1283. గృహిణి సంతానవతి ఔతుంది. ద్రాక్షలత ఫలిస్తుంది. ఆహాబు రాజు