పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 279 P.pdf/187

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ధనవంతునికి గూడ పేదవానికి చేయవలసిన సహాయం చేయనందుకు శిక్ష కలిగింది - లూకా 16,21. పై 40వ వచనంలో లాగా 45వ వచనంలో గూడా ప్రభువు "ఈ యత్యల్పులలో ఒకనికి గూడ విూరు మేలు చేయలేదు" అంటాడు. ఈ యత్యల్పులు పండ్రెండుమంది శిష్యులూ కాదు, క్రైస్తవులూ కాదు. అక్కరలో వున్న పేదసాదలు ఎవరైనాసరే.

ఈ సామెత భావం ఏమిటి? క్రీస్తు తోడి జనంలో నెలకొని ఉంటాడు. ఏ మతం వాళ్ళయినా సరే నరులందరిలోను భగవంతుడు ఉంటాడు. విశేషంగా పేదసాదల్లో అతడు బాధలు అనుభవిస్తూంటాడు. కనుక మనం ఈ తోడి జనాన్ని పరామర్శించాలి. వాళ్ళల్లో భగవంతుడు వసిసూన్నాడు. కనుక వాళ్ళకు ఎక్కడలేని విలువ వుంది. అందుచేత తోడి జనాన్ని దయతో ఆదరించినవాడు, ప్రేమతో ఆదుకొన్నవాడు, భగవంతుని మన్నన పొందుతాడు. అలా చేయనివాడు అతని శిక్షకు పాత్రుడు ఔతాడు.

ప్రభువు తోడి జనంలో వసిస్తాడు అని చెప్పాం. కనుక తోడి ಜನ್ನ್ನಿ పరామర్శిస్తే ప్రభువు తన్ను పరామర్శించినట్లే భావిస్తాడు. తోడి జనాన్ని చిన్నచూపు చూస్తే తన్ను చిన్నచూపు చూచినట్లే భావిస్తాడు. కనుక తోడి జనంతో మనం పెట్టుకొనే సఖ్యసంబంధాలు కాని, వైరవిద్వేషాలు కాని ఆ భగవంతునితో పెట్టుకొన్నట్లే ఔతుంది. ఆ భగవంతుణ్ణి మనం ఏనాడూ కంటితో చూడలేం. కాని అతనికి పోలికగా ఉన్న తోడి నరుడ్డి మాత్రం ఇరవై నాలుగు గంటలు చూస్తూనేవుంటాం. కాబట్టి ఆ భగవంతుణ్ణి గౌరవించదలచుకొంటే ఈ తోడి నరుడ్డి గౌరవించాలి. మదర్తెరీసా, వినోబాభావే వంటి మహానుభావులు పేదజనాన్ని ఆదరించి వాళ్ళకు సేవ చేయడంలో అంతరార్థం యిదే.

ఇక ఈ సామెత అన్యమతస్తులను గూర్చింది అన్నాం. క్రైస్తవులు కాని, తన్ను ఏ మాత్రం ఎరుగని, అన్యమతస్తులకు క్రీస్తు తీర్పు ఏలా విధిస్తాడు? వాళ్లు తోడిజనాన్ని ప్రేమతో చూచినట్లయితే ప్రభువు వాళ్ళను దీవిస్తాడు. తోడి జనాన్ని ప్రేమించక పోయినట్లయితే ప్రభువు వాళ్ళను శిక్షిస్తాడు! అన్యమతస్తుల తీర్పు వాళ్లు చూపే ప్రేమను బట్టి ఉంటుంది. ఇక ప్రభువు క్రైస్తవులమైన మనకు తీర్పు చెప్పేటపుడు గూడ ఈ ప్రేమనే ప్రధానంగా తీసికొంటాడు. అసలు క్రైస్తవ మతంలో ప్రధానమైన సూత్రం సోదర ప్రేమే, మరి ఈ ప్రధాన సూత్రాన్ని అన్యమతస్తుల కంటె మనం అధికంగా పాటించవద్దా? పైగా, మత్తయి సువిశేషం ప్రకారం ఇది ప్రభువు తుది సందేశం అని చెప్పాం.

3. అన్వయం

యాకోబు 2, 8 సోదర ప్రేమను “రాజశాసనం" అని పేర్కొంటుంది. అనగా అది బైబుల్లో కల్ల ప్రధానమైన నియమం అని భావం. క్రీస్తు కూడ తన శిష్యులకు ఏకైక చిహ్నం సోదర ప్రేమేనని చెప్పాడు - యోహా 13,35. కాని మనం అన్ని ఆజ్ఞలకంటె