పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 279 P.pdf/186

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అన్యమతస్తుల సంగతి యేమిటి? వాళ్ళకు ప్రభుని గూర్చి తెలియదు. మరి వాళ్ళకు ఏలాంటి తీర్పు జరుగుతుంది? ఆ ప్రశ్నకు సమాధానమే ప్రస్తుత సామెత.

ఈ సామెత మత్తయి సువార్తలో మాత్రం కనిపిస్తుంది. ఈ సువిశేషంలో ఇది క్రీస్తు పలికిన కడపటి మాటలుగా వర్ణింపబడింది. ఈ సువార్త ప్రకారం ఈ సామెత ప్రభువు తుది సందేశం కనుక దీనికి గొప్ప విలువ నీయాలి. అనగా దీని బోధలను జాగ్రత్తగా గుర్తించాలి. కడతీర్పు ఇక్కడ ఓ సామెతగా వర్ణింపబడింది. ఈ సామెతలో మత్తయి క్రీస్తు బోధల సారాంశాన్ని చెప్పాడు.

2. వివరణం

ఈ సామెతలోని న్యాయమూర్తి ఉత్తాన క్రీస్తు, ఈ క్రీస్తుకు ఇక్కడ రాజు, కాపరి, న్యాయమూర్తి అనే మాటలు వాడబడ్డాయి. ఈ న్యాయమూర్తి తీర్పు తీర్చేది సకల జాతుల వాళ్ళకూను. అనగా క్రైస్తవులు కాని అన్యమతస్తులకు.

ఈ యన్యమతస్థల్లో కొందరు గొర్రెలూ కొందరు మేకలూ పాలస్తీనా దేశంలో గొర్రెలూ, మేకలూ పగలు కలసే మేస్తాయి. కాని రాత్రి వాటిని వేరుపరుస్తారు. రేయి మేకలను కొండ గుహల్లో మూసి ఉంచుతారు. వాటికి వేడి కావాలి. గొర్రెలను మాత్రం పొల్లాల్లోనే ఉంచుతారు. వాటికి స్వచ్ఛమైన గాలి అవసరం. ఇక్కడ న్యాయాధిపతికి కుడివైపున గొర్రెలను ప్రోగుజేసారు. గొర్రె విలువైన జంతువు. దాని తెలుపురంగు కూడ నీతిన్యాయాలకు పావిత్ర్యానికి చిహ్నం. అనగా న్యాయాధిపతికి కుడిప్రక్క ప్రోగైనవాళ్ళు పుణ్యాత్ములని భావం. అతనికి ఎడమ ప్రక్కన మేకలను ప్రోగుజేసారు. గొర్రెకంటె మేక తక్కువ విలువ కలది. దాని నలుపురంగు దొంగతనానికి చిహ్నం. కనుక న్యాయాధిపతికి ఎడమ ప్రక్కన ప్రోగైన వాళ్ళ దుర్మారులని భావం.

ప్రభువు తన కుడి ప్రక్కన ఉన్న పుణ్యాత్ములను దీవించి వాళ్ళకు మోక్షాన్ని బహుమానంగా యిచ్చాడు. ఎందుకంటే వాళ్లు తోడి పేదజనానికి కరుణకార్యాలు చేసారు గనుక 40వ వచనంలో న్యాయాధిపతి "నా సోదరులకు విూరు మేలు చేసారు" అంటాడు. ఈ 'సోదరులు, పండైండుమంది శిష్యులూ కాదు, క్రైస్తవులూ కాదు. అక్కరలో నున్న పేదసాదలు ఏ మతం వాల్లెనా ప్రభువు సోదరులే. బైబులు భగవంతుడు దీనుల భగవంతుడు. పేదసాదల్లో నెలకొని వుండేవాడు.

అలాగే ప్రభువు తనకు ఎడమప్రక్కన ఉన్న దుర్మార్డులను శపించి వాళ్ళకు నరకాన్ని దండనగా విధించాడు. వాళ్ళను దయ్యాలతో తుల్యం జేసాడు. ఎందుకంటే వాళ్లు తమ చుటూరా వున్నపేదజనాన్ని ఆదుకోలేదు. వాళ్ళ పట్ల కరుణ జూపలేదు. ఇక్కడ ప్రభువు వీళ్ళకు శిక్ష విధించింది ఏదో చెడ్డ కార్యం చేసినందుకు గాదు. చేయవలసిన మంచి కార్యం చేయక విడిచిపెట్టినందులకు, ఈలాగే అబ్రాహాము లాజరు సామెతలోని