పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 279 P.pdf/183

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మనస్తత్వం అసలే తగదు. మన తరపున మనం ఎప్పడు గూడ మేము దీనులమైన ప్రభు సేవకులం అనుకొంటూండాలి. ఇది శిష్య ధర్మం.

5. నడిరేయి వచ్చిన స్నేహితుడు- లూకా 11.5-10.

1. వివరణం

ఈ సామెతను అర్థం చేసికోవాలంటే ఆనాటి పాలస్తీనా గృహమర్యాదలు తెలిసి వండాలి. పాలస్తీనా స్త్రీలు వేకువనే లేచి ఏ రోజుకు సరిపడే రొట్టెలు ఆ రోజే పొయ్యి మీద కాల్చుకొనేవాళ్ళ మామూలుగా ఒక్కో మనిషికి ఒక్కోసారి భోజనానికి మూడు రొట్టెలు పడతాయి. ఏయింటిలోనైనా ఆ రోజు కాల్చుకొన్నరొట్టెలు చాలకపోతే ప్రక్కవాళ్ళ యింటిలో అరువు తెచ్చుకొనేవాళ్ళు మరుసటి రోజు కాల్చిన రొట్టెలు తిరిగి యిచ్చి ఆ యప్ప తీర్చుకొనేవాళ్లు, ఇక్కడ మన కథలోని గృహస్తు ఇంటికి తలవని తలంపుగా ఓ అతిథి వచ్చాడు. అతనికి భోజనం పెట్టడానికి ఆనాడు ఆ యింటిలో రొట్టెలేమి? మిగలలేదు. కనుకనే ఆ గృహస్థు పొరుగు ఇంటికి వెళ్ళి అరువు అడిగాడు.

పాలస్తీనా ఇండ్లలో ఒక్కటే పెద్ద గది వుండేది. ఆ గదిలో మధ్యన అరుగు వుంటుంది. ఇంటిలోని వాళ్ళంతా రాత్రిపూట ఆ యరుగుమిూద చాపలు వేసికొని పండుకొంటారు. గొడూగోదాకూడ అదే గదిలో ఓ ప్రక్కన పండుకొంటాయి. రాత్రి పండుకొనే ముందు ఇంటి తలుపులను లోపలినుండి గడెవేసి బిగిస్తారు. ఆ గడె తీసేపడు కిర్రుమని శబ్దం చేసి అరుగుమిూద నిద్రించేవాళ్ళను మేల్కొలిపేది. అందుకే ఈ కథలోని వ్యక్తి పిల్లలు లేస్తారన్న భయంతో గడెతీసి తలుపు తెరవడానికి అంగీకరించడు.

యూదప్రజలు అతిథి మర్యాదను చాల గొప్పగా ఎంచేవాళ్ళు యింటికి వచ్చిన మనిషికి అన్నపానీయాలు అందీయని గృహస్థును అంతా చీకొట్టేవాళ్ళు ఈ కథలోని వ్యక్తికి పడకమిద నుండి లేచి మిత్రభావంతో రొట్టెలీయాలన్న తలంపు లేదు. ఐనా అతడు రొట్టెలీయకపోతే అతిథి మర్యాదను విూరినట్లవుతుంది. ఊల్లో జనమంతా తన్ను చిన్నచూపు చూస్తారు అని భయపడ్డాడు. పైగా ఆ వచ్చిన వ్యక్తిగూడ పట్టినపట్టు వదలకుండా తలుపు దగ్గరే నిలబడి అడుగుతున్నాడు. అతని పోరు వదిలించుకోవాలి. కనుక అతడు లేచి ఒకసారి భోజనానికి అవసరమైన మూడు రొట్టెలూ ఇచ్చి పంపాడు.

ఈ సామెత భావం ఏమిటి? ఇందలి గృహస్థు మిత్ర భావంతో రొట్టెలీయలేదు. అతిథి అవమానానికి భయపడి, ఎదుటి వ్యక్తి పోరు వదలించుకోగోరీ కాస్త సహాయం చేసాడు - అంతే. ఇక చెడ్డవాళ్ళెన భూలోకంలోని నరులే ఈలా సహాయం చేస్తుంటే, ఇంతకంటె అన్ని విధాల మంచివాడైన పరలోకంలోని తండ్రి మనం అడిగినప్పుడు ఎంతగా సహాయం చేయడు? ఇది సామెత భావం. ఇక్కడ దేవుడు ఈ సామెతలోని గృహస్థులాంటివాడు అని చెప్పగూడదు. అతనికంటె భిన్నమైనవాడు అని చెప్పాలి. ఈ సామెత బోధించేది సామ్యంగాదు, భేదం. అనగా భగవంతుడు ఈ గృహస్టులాంటివాడు కాదు, అతనికంటె భిన్నుడు. అతనికంటె మంచివాడు.