పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 279 P.pdf/182

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

3. అన్వయం

క్రీస్తు"నన్ను ప్రభూ! ప్రభూ! అని పిలచ్చేవాడు కాదు, నా తండ్రి చిత్తానుసారంగా జీవించేవాడు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడు" అని నుడివాడు - మత్త 7,21. మనం జీవితంలో క్రైస్తవ సూత్రాలను పాటించం. బద్దకింపు కొద్దీ ప్రభువు ఆజ్ఞలను ఉల్లంఘిస్తాం. ఈలాచేస్తే పై మందమతిని పోలినవాళ్ళ మౌతాం.

పైగా మన రాయి క్రీస్తే - 1కొ10,4. కనుక క్రీస్తు అనే పునాది రాతిమీద నిల్చేవాడు నిలుస్తాడు. ఆ రాతి మీద నిలువనివాడు నిలువడు. క్రైస్తవుల్లో కొందరు డబ్బు మిూదా, మరికొందరు అధికారం మిదా, ఇంకా కొందరు పలుకుబడి మిూదా, వేరుకొందరు కులగౌరవం విూదా నిలుస్తారు. కాని ఈలాంటి వాళ్ళంతా కాలక్రమేణ కూలిపోతారే గాని యధార్థంగా నిలువరు.

4.యజమానుడు - సేవకుడు–లూకా 17,7-9.

1. సందర్భం

పరిసయులు మోషే ధర్మశాస్రాన్ని తుచ తప్పకుండా పాటించేవాళ్ళు ఈలా ధర్మశాస్రాన్ని పాటించడం వల్లనే తాము నీతిమంతులమయ్యామని వాళ్ళు విర్రవీగేవాళ్లు.కాని మనలను పుణ్యాత్ములను జేసేది మనం చేసిన సత్కార్యాలు కాదు. మరి ఆ సత్కార్యాలను కరుణతో బహూకరించే ప్రభువు. ఈ సత్యాన్ని బోధించేదే ఈ క్రింది సామెత.

2. వివరణం

ఒక యజమానునికి ఒక్కడే బానిస వున్నాడు. వాడే పొలం దున్నాలి, గొర్రెల మందలు కాయాలి, అన్నం వండాలి, వడ్డించాలి గూడ. ఈ పనులన్నీ చేసాక గూడ యజమానుడు అతనికి కృతజ్ఞత తెలుపడు. ఎందుకంటే పనులన్నీ చేయడం అతని విధి. మనకూ భగవంతునికి వుండే సంబంధం గూడ ఈలాంటిదే. మనం ఆ ప్రభువుకి దాసులం. మనం ప్రభువు పనులన్నీ చేసిన పిమ్మట గూడ మేము ఇది చేసాం అది చేసాం అని డప్పు వాయించుకోగూడదు. మేము పుణ్యాత్ములం అని విర్రవీగగూడదు. మనకు మోక్ష బహుమానాన్ని ప్రసాదించేవాడు ప్రభువు. ఆ బహుమానం విూద మనకేమిూ హక్కులేదు. కనుక కండ్ల నెత్తిమీద కెక్కగూడదు. అసలు మనకు వినయం ఒక్కటి తగుతుంది, అంతే.

3. అన్వయం

కొంతమంది తమ్ముతామే నీతిమంతులనుగా ఎంచుకొని ఇతరులను చిన్నచూపు చూస్తూంటారు - లూకా 18,9. వీళ్ళే గర్వాత్మలు. మనం గూడ ఈ వర్గానికి చెందే అవకాశం వుంది. ఈలాంటి మనస్తత్వానికి విరుగుడు పై సామెత, ఎప్పడు గూడ మనలను రక్షించేది మన పుణ్యకార్యాలు గాదు. మరి ఆ పుణ్యకార్యాలకు ప్రభువు కరుణతో ఇచ్చే • మోక్ష బహుమానం మనలను కాపాడుతుంది. కనుకనే నేనింతటివాడ్డి అంతటివాణ్ణి అనుకోవడం మనకు తగదు. క్రైస్తవ సమాజానికి నాయకులుగా వుండేవాళ్ళకు ఈ