పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 279 P.pdf/179

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇక మూడవవాడు గృహస్థ ఐయండాలి. కనుక క్రీస్తు కథ నాలకించే శ్రోతలు ఇద్దరు యాజకుల తర్వాత తమలాంటి యూదగృహస్తుడు కథలో ప్రవేశిస్తాడు అనుకొన్నారు. కాని క్రీస్తు తలవని తలంపుగా ఈ మూడవ పాత్రను సమరయుని చేసాడు. యూదుల దృష్టిలో సమరయులు సంకరజాతివాళ్లు, అల్పులు. వాళ్ళకు వీళ్ళకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గున మండుతుండేది. క్రీస్తు జననానికి కొంచెం పూర్వం సమరయులు పాస్క పండుగకు ముందటి రాత్రి యెరూషలేము దేవాలయంలో ప్రవేశించి మృతుల అస్థలు చల్లిపోయారు. అలా వాళ్ల యూదుల పవిత్ర స్థలాన్ని అమంగళపరచారు. ఈలాంటి నీచుల తెగకు చెందిన వొకడు క్రీస్తు చెప్పే సామెతలో కథానాయకుడు కావడం చూచి శ్రోతలంతా తెల్లబోయారు.

ఐనా పీఠం చెంత నిలచి దేవుణ్ణి ఆరాధించే యాజకుల్లో కన్పించని గొప్ప గుణం ఒకటి ఈ సమరయునిలో వుంది. అదే కరుణ. అతడు ఆ బాటసారి వద్దకు వెళ్ళి వాని గాయాలకు కట్టుకట్టాడు. ద్రాక్ష సారాయం పోయడం గాయంలోని క్రిములను చంపటం కోసం, నూనె పోయడం గాయం ఎండిపోకుండా మెత్తగా వుంచడం కోసం, ప్రాచీన పాలస్తీనా ప్రజలు ఎరిగిన వైద్యవిధానం ఇది. ఈ సమరయుడు ఒక బేహారి.తన వస్తువులను కంచర గాడిద విూది కెక్కించుకొని పోతున్నాడు. అతడు క్రిందికి దిగి ఆ బాటసారిని గాడిదమిూద కూర్చోబెట్టాడు. అనగా తాను నడుస్తూ ఆ బాటసారిని వాహనం విూద కూర్చోబెట్టి మెల్లగా సత్రానికి తీసుకవెళ్ళాడు.

సమరయుడు సత్రపు యజమానునికి రెండు దీనారాలు ఇచ్చి బాధితుని పరామర్శించమని చెప్పాడు. ఆ రోజుల్లో ఒక్కదీనారానికి పండ్రెండు రోజులపాటు సత్రంలో అన్నం పెట్టేవాళ్లు అనగా ఈ బాటసారి 24రోజులు ఆ సత్రంలో వుండవచ్చు. అప్పటికల్లా కోలుకోవచ్చు గూడ. సమరయుడు సత్రపు యజమానుని దానధర్మాల విూద ఆధారపడ దల్చుకోలేదు. కనుక ముందుగనే మట్టసరిగా డబ్బు చెల్లించాడు. అతనికి ఆ త్రోవ, ఆ సత్రం, అక్కడి జనం తెలుసు. తన వ్యాపారంలో ఆ త్రోవ వెంట వస్తూ పోతూ వుండేవాడు. పాఠకులు ఈ సమరయుని ప్రవర్తనను జాగ్రత్తగా గుర్తించాలి. అతని గాడిద, నూనె, ద్రాక్షసారాయం, డబ్బు, శ్రమ, సద్భావం అన్నీ బాధితుని కోసం వినియోగింపబడ్డాయి. కరుణ అంటే ఈలా వుండాలి గదా!

క్రీస్తు కథ ముగించి దొంగల చేతిలో పడ్డవాడికి పొరుగువాడెవడు అని శాస్తిని ప్రశ్నించాడు. సమరయుడు అని చెప్పడానికి నోరురాక శాస్త్రి "ఆ కనికరం చూపినవాడే" అని జవాబిచ్చాడు. ఇక్కడ ధర్మశాస్త్ర బోధకుడు అడిగిన ప్రశ్ననా పొరుగువాడెవడు అని. అనగా నేనెవరిని ప్రేమించాలి? ఎవరిని ప్రేమించనక్కరలేదు? అని అతని ప్రశ్న ఈ ప్రశ్నకు క్రీస్తు వేసిన ప్రతిప్రశ్నదొంగల చేతిలో పడ్డవానికి పై ముగ్గురిలో పొరుగువాడెవడు " అని. అనగా ఆ ముగ్గురిలో బాటసారిని ప్రేమించినవాడెవడు అని క్రీస్తు ప్రశ్న కనుక శాస్త్రి నేనెవరిని ప్రేమించాలి అని అడగ్గా, క్రీస్తు అసలు ప్రేమించినవాడెవడు అని