పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 279 P.pdf/178

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అడిగాడు. ఆ బోధకుడు భగవంతుణ్ణి పూర్ణ హృదయంతో ప్రేమించాలి. మనలను మనం ప్రేమించుకొన్నట్లే పొరుగువాణ్ణి ప్రేమించాలి అనివుంది అని చెప్పి ఇక్కడ “పొరుగువాడు" అంటే ఎవరో నాకర్థం కావడం లేదు అని అన్నాడు. యూదుల భాషలో పొరుగువాడు అంటె దగ్గరివాడు, సజాతీయుడు, బంధువు అని భావం. ఆ రోజుల్లో యూదుల్లోని రకరకాల శాఖలవాళ్ళు "పొరుగువాడు" అన్న పదాన్ని రకరకాల విధాలుగా అర్థం జేసికొనేవాళ్న ఉదాహరణకు, పరిసయులు తమ శాఖవాళ్ళను మాత్రమే పొరుగువాళ్ళనుగా గుర్తించారు. కనుక ఇతరులైన యూదుల నెవ్వరినీ తాము ప్రేమించనక్కరలేదు అనుకొన్నారు. కుమ్రానులో వసించిన ఎస్సీనులనబడే మరో శాఖవాళ్ళు తమ శాఖకు చెందని యూదుల నందరినీ చీకటి పుత్రులనుగా భావించి నిరసించారు. కనుక వాళ్లు ఎస్పీను శాఖకు చెందని యూదులను ప్రేమింపనక్కరలేదు అనుకొన్నారు. ఈవిధంగా క్రీస్తునాటి యూదులు యూదులను మాత్రమే - మళ్ళా ఈ యూదుల్లో తమ శాఖకు చెందినవాళ్ళను మాత్రమే - ప్రేమించాలి అని బోధించేవాళ్లు, యూదులు కాని అన్యజాతి జనులను కూడ ప్రేమించాలి అన్నభావం అసలు వాళ్ళకు తట్టనేలేదు. అందుకే టాల్మడ్లో ఉదాహరింపబడిన ఒకానొక రబ్బయి వాక్యం యూదులు కాని అన్యజాతి వాళ్ళందరినీ గోత్రిలో తోయాలనీ వాళ్ళను మళ్ళా పైకి లాగకూడదనీ బోధిస్తుంది. ఈలాంటి వాతావరణంలో ధర్మశాస్త్ర బోధకుడు నా పొరుగువాడు ఎవడు అని ప్రశ్నించడంలో వింత ఏముంది? ఈ శబ్దాన్ని గూర్చిన యూదుల వాదోపవాదాలు ఈలా వున్నాయి. మరి ఈ క్రొత్త రబ్బయి క్రీస్తు ఈ పదానికి ఏలా అర్థం చెప్తాడో చూద్దామని అతని కుతూహలం.

2. వివరణం

పై వేదశాస్త్రి ప్రశ్నకు క్రీస్తు నిర్వచన రూపంలో గాక, కథ రూపంలో జవాబు చెప్పాడు. యేరూషలేము నుండి యెరికోకు పోయే త్రోవ పొడవు 17 మైళ్లు, కొండలగుండ 3000 అడుగులు క్రిందికి దిగిపోతుంది. క్రీస్తునాడు ఈ మర్గం దొంగలకూ బందిపోటులకూ నిలయంగా వుండేది. నేడుకూడ ఈ త్రోవవెంట ప్రయాణం చేయడం అపాయంతో గూడిన పని. కనుక ఈ కథలోని బాటసారి దొంగలకు చిక్కడంలో ఆశ్చర్యమేమి లేదు.

యెరూషలేము దేవాలయంలో అర్చన ముగించుకొని వస్తున్న యాజకుడూ లేవీయుడూ దెబ్బలుతిని త్రోవప్రక్కన కొన ఊపిరితో పడివున్న బాటసారిని చూచారు. ఐనా వాళ్ళకు దయ కలుగలేదు. పైగా అతని దగ్గరకు వేళ్తే ఏమి చిక్కువచ్చిపడుతుందో త్రోవకు రెండు వైపులు వుంటాయి గదా! వాళ్ళిద్దరు మొదట ఆ బాటసారి పడివున్న వైపుననే వస్తున్నారు. కాని అతన్ని చూడగానే త్రోవ అవతలి వైపునకు తప్పకొని తిన్నగా సాగిపోయారు.

మూడవసారి వచ్చినవాడు సమరయుడు. యూదులు ఈలాంటి నీతికథల్లో మామూలుగా మూడు పాత్రలను ప్రవేశపెట్టేవాళ్లు, మొదటి ఇద్దరూ యాజకులు గనుక