పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 279 P.pdf/180

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రశ్నించాడు. ఇక్కడ క్రీస్తు భావం ఇది. ఎవరిని ప్రేమించాలి అన్నది ప్రశ్నకాదు. అసలు మనం ఎవరినో వొకరిని ప్రేమించగలమా అన్నది ప్రశ్న అక్కరలో వున్న వాళ్లందరూ మన పొరుగువాళ్లే కనుక అక్కరలో వున్నవాళ్ళనందరినీ ప్రేమతో అంగీకరింపవలసిందే. యూదులు వాళ్ళను గాదు వీళ్ళను ప్రేమించాలి, వీళ్ళను గాదు వాళ్ళను ప్రేమించాలి అనే వ్యర్ధవాదాలతో కాలం వెళ్ళబుచ్చుతున్నారు. సంకుచితమైన జాతి మత భేదాలతో సతమతమౌతున్నారు. ఆ సమరయుళ్లాగ ఆపదలో వున్నవాణ్ణి - వాడు ఏ జాతివాడైనా ఏ మతం వాడైనా - ఆదుకోవడం ప్రధానం. ఇదే శిష్యధర్మం.

3. అన్వయం

ఈ సామెతలోని మంచి సమరయుడు ఎవరు? క్రీస్తే మానవజాతి పాపం వలన గాయపడి కొనవూపిరితో పడివుండగా అతడు జాలితో తన ప్రాణాలు ఒడ్డాడు. తన ప్రాణాలర్పించి మన ప్రాణాలు కాపాడాడు, క్రీస్తు ఎవరిని ప్రేమించాలి ఎవరని ప్రేమించనక్కరలేదు అనే శుష్క ప్రశ్నలతో కాలం వెల్లబుచ్చలేదు. ఈ విశ్వమానవాళి కోసం తన ప్రాణాలు ధారపోసాడు. ఆ ప్రభువులాగే మనం కూడ తోడి జనాన్నందరినీ ప్రేమించాలి. కుల మత భేదాలు పాటించకుండా బాధపడే వాళ్ళందరికీ మనకు చేతనైన సహయం చేయాలి. మహానుభావులు ఈ ప్రపంచమంతా మా కుటుంబమేనని భావిస్తారు ఈ సామెతలో బాటసారికి త్రోవ వెంట వచ్చినవాళ్లు ముగ్గురూ పొరుగువాళ్ళే కాని బాటసారి ఆ ముగ్గురిలో సమరయునికి మాత్రమే పొరుగువాడయ్యాడు. లోకంలో మనకు పొరుగువాజైనవాళ్లు ఎంతమంది?

2 పొలములోని ఇల్లూ, యుద్ధమూ - లూకా 14,28-82

1. సందర్భం

క్రీస్తు స్వార్థత్యాగం శిష్యలక్షణాల్లో ఒకటిగా పేర్కొన్నాడు. శిష్యుడు కాగోరేవాడు తన సిలువ నెత్తుకొని తన అడుగుజాడల్లో నడవాలి అని చెప్పాడు. ఈ స్వార్థ త్యాగాన్నే రెండు ఉపమానాలతో వివరించాడు ప్రభువు.

2. వివరణం

మొదటి ఉపమానం పంటపొలంలో కట్టేయిల్ల. ఈ యిల్ల ధాన్యాన్ని తొక్కించి నిల్వజేసికోవడానికీ, పశువులను ఉంచుకోవడానికీ, పొలానికి కాపుండడానికి ఉపయోగపడుతుంది. భూస్వామికి ఇంటిని కట్టి ముగించే స్తోమత వుంటేనే దాన్ని ప్రారంభించాలి. డబ్బులేక మధ్యలో ఆపివేస్తే నగుబాట్ల పాలౌతాడు. రెండవ ఉపమానం, శత్రురాజు మన మిదికి దండెత్తి వస్తున్నాడు. మనం ఏం చేయాలి? బలముంటే అతన్ని ఎదిరించి పోరాడవచ్చు బలం లేకపోతే అతనితో ముందుగానే సంధి చేసికోవడం మంచిది.