పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 279 P.pdf/162

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

2. అన్వయం

యెహెజ్కేలు ప్రవచనంలో ప్రభువు "పాపాత్ముడు మరణించడం వలనగాక, పాపకార్యాలను విసర్జించి మరల బ్రతకడం వలన నాకు సంతృప్తికలుగుతుంది" అంటాడు - 18,23. మనం పాపంజేసినపుడు ప్రభువు మనలను శిక్షించాలని కోరుకోడు, మనం నాశమైపోవాలని అనుకోడు. కాని మనం పాపం నుండి వైదొలగి దైవప్రేమతోగూడిన వరప్రసాద జీవితాన్ని జీవించాలనిమాత్రంకోరుకొంటాడు. అతడు జాలిగుండెలుకలవాడు. తన బిడ్డలమైన మన శ్రేయస్సు తప్పితే అతడు కోరుకునేదేమీలేదు. భక్తుడు ఈ సామెతలు చిత్రించే భగవంతుని కరుణాహృదయాన్ని అర్థం చేసికోవాలి.

3. తప్పిపోయిన కుమారుడు - లూకా 15, 11-82

1. సందర్భం

క్రీస్తు సుంకరులనూ పాపులనూ చేరదీస్తుండగా యూద నాయకులు అతనిమీద గొణగారు. అందుకు క్రీస్తు ఆ క్రింది వర్గం వాళ్ళని సమర్ధిస్తూ మూడు సామెతలు చెప్పాడన్నాం. అవే తప్పిపోయిన గొర్రె, జారిపోయిన నాణెం, తప్పిపోయిన కుమారుడునూ. ప్రస్తుత సామెతను తప్పిపోయిన కుమారుడు అనడం కంటె "కరుణాళువైన తండ్రి సామెత” అనడం మేలు. ఇందలి ప్రధానపాత్ర కుమారుడు కాదు. అతని తండ్రి. తన తండ్రి మంచి గుణాన్ని గ్నాప్థి దెచ్చుకొనే కుర్రవాడు పశ్చాత్తాపపడ్డాడు. కారుణ్యప్రదర్శనంలో ఈ తండ్రి ఆ పరలోకపు తండ్రికి ప్రతిబింబం.

2. వివరణం

తప్పిపోయిన కుమారుడు తన ఆస్తిని తాను పంచుకోగోరాడు. యూదుల ఆచారం ప్రకారం తండ్రి ఆస్తిలో రెండు వంతులు పెద్ద కుమారునికి, ఒక వంతు చిన్నకుమారునికి లభిస్తాయి - ద్వితీయోప 21, 17. కనుక ఇక్కడ చిన్నవానికి తండ్రి యాస్తిలో మూడవ వంతు వచ్చి వుండాలి. చిన్నవాడు తన వాటాను వెంటనే విక్రయించి వచ్చిన ధనంతో దూరపు పట్టణాలకు వెళ్ళిపోయాడు. క్రీస్తు నాడు ఇంచుమించు పది లక్షలమంది యూదులు ఉండేవాళ్లు, వాళ్లల్లో ఐదు లక్షలమంది పాలస్తీనా దేశంలో, ఐదు లక్షలమంది అన్యదేశాల్లో వసిస్తూండేవాళ్లు కావున ఈ చిన్న కుమారుడు దూరదేశాలకు వెళ్ళిపోవడంలో వింతేమీలేదు. కాని అలా వెళ్ళి పెండ్లిజేసుకొని సొంతకుటుంబాన్ని నెలకొల్పుకొని డబ్బు జేసికోవడానికి మారుగా భోగలాలసుడై తిరుగుతూ చేతిలో వున్నదికాస్త ఖర్చు జేసికొన్నాడు.

బెల్లానికి ఈగల్లాగ డబ్బు కన్పించినన్నాళ్లు అతని చుట్టు మూగిన స్నేహితులంతా ఎవరిత్రోవన వాళ్లు సాగిపోయారు. ఇక కుమారునికి ఆ దూరపు భూముల్లో "నా? అనే వాళ్ళెవరూ లేరు. గోరుచుట్టపై రోకటిపోటన్నట్లు అంతలోనే ఆ గడ్డమీద పెద్ద కరువగూడ