పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 279 P.pdf/163

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దాపురించింది. ఉంటానికి ఇల్లులేక, తింటానికి తిండిలేక మలమల మాడిపోతూ చివరికి ప్రాణాలైన నిలుపుకొందామనుకొని అతడు ఓ భూస్వామి యింట పందులుగాసే ఒప్పందంమీద జీతానికి గుదిరాడు. దీనివల్ల ఆ చిన్నవానికి రెండవమానాలు సిద్ధించాయి. మొదటిది, యూదులు అన్యమతస్తుల వద్దకు పోరు. అతని యింటిలో ఇతడు సబ్బతు ననుసరించలేడు. శుద్ధిగల భోజనం భుజించనూలేడు. కనుక ఓ సనాతన బ్రాహ్మణుడు దళితునింట సేవకు కుదిరినట్లయింది. రెండవది, యూదులకు పందులు అపవిత్ర మృగాలుగాన వాటి దగ్గరికైన పోరు - లేవీ 11,7. ఐనా తానీ పందులను కాయవలసి వచ్చింది. ఈ నీచవృత్తిలోగూడ అతనికి కడుపునిండ కూడు దొరకలేదు. ఆ పందులకు ఒక జాతి చిక్కడుగాయలు పోసేవాళ్ళ కనీసం ఆ పందులు నమిలే చిక్కుడు గింజలతోనైనా కడుపు నింపుకొందామనుకొన్నాడు చిన్నవాడు. కాని పందుల దగ్గరికి వెళ్ళి అవి చప్పరించే గింజలు తీసికోవాలంటే అతనికి ఏవగింపు పుట్టింది.

ఈ కష్టాలన్నీ అతని కండు విప్పాయి. ఎంత బ్రతికి చెడినా తానేమో గొప్పవారియింటి బిడ్డడాయె! మహారాజసు బోలిన తన తండ్రి యింట పనిచేస్తున్న ఊడిగపుదారులు తన కంటే గొప్ప స్థితిలో వున్నారు. తాను ఆ సేవకుల్లో చేరితే పొట్టనిండా కమికెడు కూడు తిని బ్రతికిపోవచ్చు. చిన్నవాడు ఈలా తలపోసికొంటూ తండ్రివద్ద వల్లెవేయడానికై ఓ చిన్న ఉపన్యాసం తయారుచేసికొని యింటి దారి పట్టాడు.

అక్కడ తండ్రి తప్పిపోయిన కుమారుడ్డి మాటిమాటికి స్మరించుకొంటూ, బిడ్డ ఏలాంటి బాధలకు గురౌతున్నాడో అని చింతిస్తూ, ఏనాడైనా మనసు మార్చుకొని మరలిరాక పోతాడా అని కొండంత ఆశతో కుమారుని రాకకై తెన్నులు జూస్తూన్నాడు. నాడు తోబియా గారాబుతల్లి అన్నాగూడ పత్రుని రాకకైయిూలాగే దారులు కాచుకొని వుండేదని వింటున్నాం - తోబి 11, 5-6.

చిన్నవాడు మరలివచ్చాడు. అలా వస్తున్నవాణ్ణి అల్లంత దూరంనుండే గుర్తుపట్టి గబగబ పరుగెత్తుకొనిపోయి ఆలింగనం జేసికొన్నాడు ఆ తండ్రి. ఈ యాలింగనం తండ్రి కుమారుడ్డి క్షమించాడనడానికి చిహ్నం. ఈలాగే ఓమారు అపరాధియై తన యెదుటికి వచ్చిన కుమారుడు అబ్వాలోముని దావీదు ఆలింగనం జేసికొని క్షమించాడు-2 సమూ 14, 33, కుమారుడు తాను జాగ్రత్తగా తయారుజేసికొని వచ్చిన ఉపన్యాసాన్ని ముగించక పూర్వమే తండ్రి అతన్ని యింటిలోనికి తోడ్కొని వచ్చాడు. బికారిలాగ వచ్చిన బిడ్డనికి శ్రేష్టమైన శాలువ గప్పించాడు. కాళ్ళకు చెప్పలూ చేతికీ ఉంగరమూ తొడిగించాడు. మాంసం వండించి విందులు చేయించాడు.

ఇక్కడ మూడంశాలు గుర్తించాలి. 1) కప్పుకోవడానికి శ్రేష్టమైన శాలువ నీయడమంటే మర్యాదనూ క్రొత్త జీవిత ప్రారంభాన్నీ సూచించడం - మత్త 9, 16, అనగా