పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 279 P.pdf/150

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బడినవాడు. దేవునిపట్ల అతని ప్రేమకూడ తక్కువే. ఈ విధంగా ఈ కథద్వారా ప్రభువు మరియు పశ్చాత్తాపాన్ని ప్రశంసించాడు - లూకా 7, 41-47.

వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ మొదట తన పాపాలకు పశ్చాత్తాపపడలేదు. యూదులు ఆమెను తలవని తలంపుగా పట్టుకొన్నారు. రాళ్లతో కొట్టడానికి సిద్ధమయ్యారు. కనుక అవమానమూ భయమూ ఆమెను ఆవహించాయి. ఇక పశ్చాత్తాపానికి వ్యవధి యొక్కడిది? ఆ సమయంలో క్రీస్తు ప్రత్యక్షమై ఆమె శత్రువులను వెళ్లగొట్టాడు. ఇక ఆమెకు మరణభీతి లేదు. కనుక కొంచెం తెప్పరిల్లింది. ప్రభువు అమ్మా ఇక వెళ్లి పాపం చేయకుండా బ్రతుకు అని ప్రోత్సహించాడు. ఆ మాటల వలన ఆమె తన పాపం ఎంత ఫరోరమైందో అర్థం చేసికొంది. పశ్చాత్తాపపడింది. దేవుని ప్రేమను గ్రహించింది. మళ్లా పాపానికి వొడిగట్టలేదు - యోహా 8, 7-11. ఈ విధంగా పశ్చాత్తాప బోధల ద్వారా క్రీస్తు కొందరు స్త్రీల హృదయాలు మార్చాడు.

2. విశ్వాస బోధలు

క్రీస్తు తన అద్భుతాలతో కొందరు స్త్రీల విశ్వాసాన్ని పెంచాడు. రక్తస్రావంతో బాధపడే స్త్రీ క్రీస్తు దగ్గర ఏదో మాంత్రికశక్తి వుందనుకొంది. తానతన్ని తాకితే చాలు ఆ శక్తి తనలోకి ప్రవేశించి తనకు ఆరోగ్యదానం చేస్తుంది అనుకొంది. అలా అనుకొని అతన్ని ముట్టుకొంది. కాని క్రీస్తు ఆమెనుండి ఆ మూఢ భావాలను తొలగించాడు. కుమారీ! ని విశ్వాసం నిన్ను స్వస్థపరచింది అని చెప్పాడు. ఆమెకు ఆరోగ్యాన్ని ప్రసాదించింది క్రీస్తులోని మాంత్రిక శక్తికాదు. ఆమె విశ్వాసమే ఆమెను స్వస్టరాలిని చేసింది. ఆమె విశ్వాసాన్ని జూచి దేవుడు క్రీస్తుద్వారా ఆమెకు ఆరోగ్యాన్ని దయచేసాడు. ఈ సత్యాన్ని ఆమె బాగా గ్రహించేలా చేసాడు ప్రభువు. ఈ విధంగా ఆమె విశ్వాసం పెరిగింది - లూకా 8, 48.

కననీయ స్త్రీకూడ క్రీస్తులో ఏదో అద్భుత శక్తివుందని భావించింది. కనుకనే తన కొమార్తెకు. పట్టిన దయ్యాన్ని వదలించమని క్రీస్తుని పదేపదే అడుగుకొంది. కాని క్రీస్తు ఆమెను కుక్కతో పోల్చాడు. ఐనా ఆమె బాధపడలేదు. కుక్కపిల్లలుకూడ తమ యజమానిని బల్లమీది నుండి జారిపడే రొట్టెముక్కలు తింటాయికదా అని మరీ యొక్కువ విశ్వాసంతో మనవి చేసింది. అంతట క్రీస్తు ఆమె తన శక్తిని మాత్రమే కాక తన దయనూ ప్రేమనూ గూడ అర్థం చేసికొనేలా చేసాడు. అమ్మా! నీ విశ్వాసం మెచ్చదగింది. నీ కోరిక నెరవేరునుగాక అన్నాడు. ఇంటికి వెళ్లిచూడగా ఆమె బిడ్డ ఆరోగ్యంగా వుంది. ప్రభువు