పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 279 P.pdf/151

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దూరం నుండే ఆమె కొమార్తెకు ఆరోగ్యదానం చేసాడు. ఆ స్త్రీ క్రీస్తు వాక్యంలోని శక్తిని నమ్మింది. అతని దయనూ ప్రేమనూ గూడ నమ్మింది - మత్త 15, 28.

లాజరు చనిపోయినందున మార్త దుఃఖిస్తూంది. క్రీస్తు చనిపోయిన లాజరుని చూడ్డానికి వచ్చాడు. మార్త ప్రభూ! నీవు ఇక్కడున్నట్లయితే నా సోదరుడు చనిపోయేవాడుకాదు అని యేడ్చింది. క్రీస్తు ఆమెను ఓదారుస్తూ లాజరు మల్లా లేస్తాడని చెప్పాడు. మార్త ఔను అతడు అంతిమ దినాన పునరుత్తానమయి మళ్లా లేస్తాడు అని బదులు చెప్పింది. ప్రభువు ఆమె విశ్వాసాన్ని పెంచగోరి "నేనే పునరుత్తానాన్ని జీవాన్ని నన్ను విశ్వసించేవాడు మరణించినా మళ్ళా జీవిస్తాడు" అని చెప్పాడు - యోహా 11, 25. మార్త క్రీస్తు అద్భుత శక్తిని నమ్మింది. ఆమె నమ్మినట్లే ప్రభువు లాజరుని జీవంతో లేపాడు. ఈ విధంగా క్రీస్తు రక్తస్రావ రోగి, కననీయ స్త్రీ, మార్త - ఈ ముగ్గురి విశ్వాసాన్ని పెంచాడు.

3. వాక్య బోధలు

మరియు మార్తల కథ చూస్తే క్రీస్తు వాళ్ళను వాక్యబోధ వినమని ప్రోత్సహించినట్లుగా అర్థమౌతుంది. అతడు మార్తను అనేక కార్యాలతో సతమతం కావద్దన్నాడు. ఒకటి మాత్రమే అవసరమని చెప్పాడు. అది క్రీస్తు బోధించే వేదవాక్యం విని పరలోకంలోని తండ్రిని ధ్యానించుకోవడం. ఈ విధంగా ప్రభువు ఆమె మనసును వేదవాక్యంవైపు త్రిప్పాడు. ఇక, మరియ మొదటినుడి అతని పాదాల చెంత కూర్చుండి అతని వాక్యబోధ వింటూనే వుంది. ఆమె వత్తమమైనదాన్ని ఎన్నుకొంది. అనగా క్రీస్తు ఆమెను శిష్యురాలినిగా ఎన్నుకొని ఆమెకు వాక్యాన్ని బోధించాడు.

ఇక్కడ ఇంకో విశేషంకూడ వుంది. మార్త ఇంటి యజమానురాలు. క్రీస్తు చుట్టం. కనుక మార్త క్రీస్తుకి భోజనం పెట్టబోయింది. కాని ఆమె పెట్టేది మామూలు భోజనం. దానివల్ల పెద్ద ఫలితం వుండదు. కనుక క్రీస్తే మరియా మార్తలకు భోజనం పెట్టాడు. అతడు పెట్టింది మామూలు భోజనంకాదు. వాక్యభోజనం. ఈ వాక్యభోజనం పెట్టినపుడు క్రీస్తే యజమానుడయ్యాడు. మరియా మార్తలు చుట్టాలయ్యారు. ఈ గూధార్థం కూడ ఈ కథలో వుంది — లూకా 10, 38–42.

ఓ దినం ఓ స్త్రీ క్రీస్తు బోధకు ముగ్గురాలై నిన్నుమోసిన గర్భం ధన్యమైంది అంది. కాని ప్రభువు దేవుని వాక్కును ఆలించి పాటించేవాళ్లు మరీ ధన్యులు అని పల్మాడు. మరియు క్రీస్తుకి జన్మనీయడం ధన్యమైన కార్యమే. కాని ఆమె ఇదిగో నీ దాసురాలను అని పల్కి దేవుని వాక్యాన్ని విశ్వసించడం తక్కువ ధన్యత్వమేమీ కాదు. ఇప్పడు ఈ స్త్రీకూడ