పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 279 P.pdf/148

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

5. స్త్రీలకు క్రీస్తుపట్ల ఆదరభావం

క్రీస్తు ఏ సందర్భంలోను స్త్రీలను చిన్నచూపు చూడలేదు. అనాదరం చేయలేదు. పురుషులలాగే స్త్రీలుకూడ దేవుని ప్రతిరూపాలని అతని నమ్మకం. అతడు వాళ్ళను మెచ్చుకొన్నాడు. ప్రోత్సహించాడు. ఆ ಪ್ರಿಲು కూడ కృతజ్ఞతాపూర్వకంగా అతన్ని ప్రశంసించారు. భక్తిశ్రద్ధలతో అతని బోధలు ఆలించారు. కొందరు అతనికి శిష్యులయ్యారు. కొందరు తమ సొంత సొమ్ముతో అతనికి భోజనాది అవసరాలను తీర్చారు.

పేత్రు అత్త క్రీస్తుకి ఆతిథ్యమిచ్చిందని చెప్పాం. అంతకంటె ఘనంగా మార్త ఆతిథ్యమిచ్చింది. ఆమె క్రీస్తుకి భోజనం సిద్ధంజేసేపుడు ఎన్నో పనులనుగూర్చి సతమతమైంది. అనగా శ్రమపడి చాల వంటకాలు తయారు చేసింది. అతనిపట్ల ఆమెకున్న ఆదరభావం అంత గొప్పది — లూకా 10, 38–42.

బెతనీ గ్రామంలో సీమోను ఇంటిలో యేసు పాదాలను కన్నీటితో తడిపి వాటికి పరిమళ ద్రవ్యం పూసిన మరియ భక్తికూడ చాల గొప్పది. ఆమె మరియ మగ్డలీనా కాదు, మార్త చెల్లెలు మరియాకాదు. మరో మరియ. వ్యభిచార వృత్తివల్ల కళంకితురాలై చెడ్డపేరు తెచ్చుకొంది. ఆమె క్రీస్తు బోధవిని పరివర్తనం చెందింది. పశ్చాత్తాపంతో గాఢభక్తితో అతని పాదాలపై కన్నీరు కార్చింది. వాటిని తన తలవెండ్రుకలతో తుడిచింది. పరిమళ తైలంతో అభిషేకించింది. ఆమె హృదయం కృతజ్ఞతా భావంతో నిండిపోయింది - లూకా 7, 36-38.

వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని ప్రభువు మరణంనుండి కాపాడాడు. కనుక ఆమె తన పాపాల కొరకు పశ్చాత్తాపపడి కన్నీరు కార్చింది. కృతజ్ఞతా పూర్వకంగా తన పాప జీవితాన్ని మార్చుకొంది - యోహా 8, 10-11. అలాగే సమరయ స్త్రీకూడ యేసు బోధలవల్ల పరివర్తనం చెందింది. కృతజ్ఞతా పూర్వకంగా వూల్లోకివెళ్లి ప్రజలను పిల్చుకొని వచ్చి వారికి క్రీస్తుని చూపించింది - యోహా 4, 28-30.

క్రీస్తుని సిలువ వేసేప్పడు ఒక్క రూప8న తప్ప తతిమ్మా శిష్యులంతా పారిపోయారు. కాని ప్రభువు శిష్యురాళ్లు అలా పారిపోలేదు. వాళ్లు సిలువ దగ్గరే నిలబడివున్నారు. ఆ భక్తురాళ్లు మరియమాత, ఆమె సోదరి, క్లోపాభార్యయైన మరియ, మద్దల మరియ మొదలైనవాళ్లు. వీళ్ళంతా గలిలయ నుండి యెరూషలేముకి వచ్చారు. వీళ్లు పిలాతు తీర్పుని విన్నారు. సిలువ మార్గంలో క్రీస్తుని వెంబడించి వచ్చారు. అతడు సిలువపై చనిపోయేప్పడు, దాపులోనే వున్నారు. క్రీస్తుని సిలువవేసే సైనికులు అతని శిష్యురాళ్ళయిన ఈ స్త్రీలను దయతో చూచివుండరు. వాళ్లను కసురుకొని భయపెట్టి