Jump to content

పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 279 P.pdf/147

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

క్రీస్తుని సిలువ వేయడానికి తీసికొని పోయేటప్పడు యెరూషలేము పుణ్యస్త్రీలు అతనిపై సానుభూతి చూపిస్తూ పెద్దగా ఏడ్చారు. క్రీస్తు వారి సద్భావాన్ని గుర్తించి మీరు నా కొరకు సంతాపపడవద్దు, మీ బిడ్డలకొరకు దుఃఖించండి అన్నాడు. అనగా త్వరలోనే రోమనులు యెరూషలేమును నాశం చేస్తారు. అప్పుడు యూదస్త్రీలూ వారిబిడ్డలూ నానా యాతనలకు గురౌతారు. కనుక ఆ తల్లలు ముందుగానే తమ బిడ్డలకొరకు ఏడ్వాలని భావం. ఇక్కడ పుణ్యస్త్రీలు క్రీస్తుపట్ల చూపిన జాలికంటే అతడు వారిపట్ల చూపిన జాలిగొప్పది - లూకా 23, 27-28.

4. స్త్రీల sరక్ష అద్భుతాలు చేయడం

ప్రభువు స్త్రీలపై జాలికలిగి అద్భుతాలుచేసి వాళ్ళ వ్యాధిబాధలను తొలగించాడు. మగ్గల మరియకు ఏడుదయ్యాలు పూన్నాయి. ఇక్కడ ఏడు దయ్యాలంటే అర్ధం ఏమిటి? యూదుల భావాల ప్రకారం ఏడు పరిపూర్ణతను తెలియజేస్తుంది. అనగా మరియ పూర్తిగా దయ్యం అధీనంలో వుందని భావం. కనుక ఆమె పరిస్థితి దారుణంగా వుండి వుండాలి. ప్రభువు ఆ స్త్రీపై జాలిగలిగి ఆమె నుండి పిశాచాన్ని పారదోలాడు - లూకా 8,2.

రక్తస్రావరోగి ప్రభువు దివ్యశక్తిని నమ్మి అతని అంగీ అంచుని మట్టింది. వెంటనే ఆమెకు స్వస్థత కలిగింది. ప్రభువు ఆమె నమ్మకాన్ని మెచ్చుకొని కుమారీ! నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచింది. ఇక సమాధానంగా వెళ్ళ అన్నాడు — లూకా 8, 48. ఆలాగే 18 ఏండ్ల పాటు పిశాచపీడనకు గురియై వంగిన నడుముతో బాధపడుతూన్న స్త్రీకి గూడ ప్రభువు ఆరోగ్యం దయచేసాడు - లూకా 13, 10-13.

కొన్నిసార్లు క్రీస్తు స్త్రీల మనవిని ఆలించి అద్భుతాలు చేసాడు. నయ్యీను విధవకు ఒక్కడే కొడుకు. అతడు చనిపోయాడు. ఇక ఆమెను ఆదుకొనేవాళ్ళు ఎవరూ లేరు. యూదసమాజంలో దిక్కూ మొక్మూలేని విధవ నానా యాతనలు పడుతుంది. పత్రశోకంతో విలపిస్తూన్న ఆ వితంతువును జూచి ప్రభువు జాలి జెందాడు. అమ్మాయిక ఏడ్వవద్దని ఆమెను ఓదార్చాడు. ఆమె కుమారుణ్ణి అద్భుతంగా బ్రతికించాడు - లూకా 7, 13-17. ఆలాగే మరియా మార్తల దుఃఖాన్ని చూచి అతడు చనిపోయిన లాజరుని జీవంతో లేపాడు. యాయిూరు కుమార్తెను గూడ జీవంతో లేపాడు. కానాపూరి అద్భుతంగూడ మరియ అడినందున చేసిందే. ఈ యద్భుతాలన్నీ ప్రభువుకి స్త్రీలపట్ల గల జాలినీ సద్భావాన్నీ సూచిస్తాయి.

141